For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs AUS: సెంచరీతో రికార్డుల మోత మోగించిన రోహిత్ శర్మ..!

Rohit Sharma Becomes First Indian Captain To Score A century In All Three Formats

నాగ్‌పూర్: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాగ్‌పూర్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్‌లో సెంచరీ సాధించిన హిట్‌మ్యాన్.. మూడు ఫార్మాట్లలో సెంచరీ చేసిన తొలి భారత కెప్టెన్‌గా చరిత్రకెక్కాడు. శుక్రవారం రెండో రోజు ఆటలో టాడ్ మర్ఫీ వేసిన 63వ ఓవర్లో ఫోర్ బాదిన రోహిత్.. 171 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కెరీర్‌లో రోహిత్‌కు ఇది 9వ టెస్ట్ సెంచరీ.

కెప్టెన్ అయ్యాక రోహిత్.. సుమారు రెండున్నరేండ్ల తర్వాత వన్డేలలో ఇటీవలే న్యూజిలాండ్ మీద సెంచరీ చేశాడు. టీ20ల్లో విరాట్ కోహ్లీకి డిప్యూటీగా.. అతని గైర్హాజరీలో తాత్కలిక సారథిగా జట్టును నడిపించిన రోహిత్.. రెండు సెంచరీ బాదాడు. 2017లో శ్రీలంకపై 43 బంతుల్లో 118, 2018లో వెస్టిండీస్‌పై 61 బంతుల్లో 111 పరుగు చేశాడు.

తొలి భారత కెప్టెన్‌గా..

ఇటీవల న్యూజిలాండ్‌తో వన్డేల్లో సెంచరీ బాదిన రోహిత్.. తాజా సెంచరీతో భారత్ తరఫున అన్ని ఫార్మాట్లలో సెంచరీ చేసిన సారథిగా నిలిచాడు. గతంలో ధోనీ, కోహ్లీలకు కూడా ఈ రికార్డు సాధ్యం కాలేదు. సాధించలేకపోయారు. కెప్టెన్‌గా ధోనీ వన్డే, టెస్ట్‌ల్లో శతకాలు నమోదు చేసినా.. టీ20ల్లో మూడెంకల స్కోర్ అందుకోలేకపోయాడు. విరాట్ కోహ్లీ కూడా కెప్టెన్‌గా టీ20ల్లో సెంచరీ చేయలేదు. గతేడాది ఆసియా కప్‌ 2022 విరాట్ సెంచరీ బాదినా.. అప్పటికే అతను కెప్టెన్సీ వదిలేసాడు.

నాలుగో ప్లేయర్..

అంతర్జాతీయంగా చూస్తే ఈ ఘనత సాధించిన కెప్టెన్లలో రోహిత్ నాలుగో స్థానంలో నిలిచాడు. రోహిత్ శర్మ కన్నా ముందు శ్రీలంక కెప్టెన్ తిలకరత్నే దిల్షాన్, సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్, పాకిస్థాన్ కెప్టెన్ బాబార్ ఆజామ్‌లు ఈ ఘనతను అందుకున్నారు. దిల్షాన్ సారథిగా మూడు ఫార్మాట్లలో సెంచరీలు చేసిన తొలి కెప్టెన్. దిల్షాన్ కెప్టెన్‌గా టెస్టుల్లో ఇంగ్లండ్, వన్డేల్లో జింబాబ్వే, టీ20ల్లో ఆస్ట్రేలియాపై సెంచరీలు బాదాడు. ఆ తర్వాత ఫాఫ్ డుప్లెసిస్.. సారథిగా న్యూజిలాండ్(టెస్ట్), ఆస్ట్రేలియా(వన్డే), వెస్టిండీస్(టీ20) సెంచరీలు బాదాడు. బాబార్ ఆజామ్.. ఆస్ట్రేలియా టెస్ట్‌ల్లో, జింబాబ్వేపై వన్డేల్లో, సౌతాఫ్రికాపై టీ20ల్లో శతకాలు బాదాడు.

స్మిత్ రికార్డు బద్దలు..

అత్యధిక సెంచరీలు బాదిన ఈ తరం ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ నాలుగో స్థానంలో నిలిచాడు. 74 సెంచరీలతో విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో ఉండగా.. డేవిడ్ వార్నర్ (45), జోరూట్(44) రోహిత్ కన్నా ముందున్నారు. 43 సెంచరీలతో రోహిత్.. స్టీవ్ స్మిత్(42) వెనక్కునెట్టాడు. ఓపెనర్‌గా రోహిత్‌కు ఇది ఆరో సెంచరీ. ఓపెనర్‌గా ఇప్పటి వరకు 31 ఇన్నింగ్స్‌లు ఆడిన రోహిత్ 6 సెంచరీలతో పాటు 4 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు.

భారత్‌కు ఆధిక్యం..

భారత్‌కు ఆధిక్యం..

77/1 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను కొనసాగించిన టీమిండియా.. రోహిత్ శర్మ(212 బంతుల్లో 2 సిక్స్‌లతో 120)కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆసీస్ స్కోర్‌ను అధిగమించి భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. రోహిత్‌కు అండగా జడేజా(38 బ్యాటింగ్) రాణించాడు. ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగిన పుజారా(7), కోహ్లీ(12), సూర్యకుమార్ యాదవ్(8), శ్రీకర్ భరత్(8) ధారుణంగా విఫలమయ్యారు. 85 ఓవర్లు పూర్తయ్యే సరికి భారత్ 7 వికెట్లకు 246 పరుగులు చేసింది.

Story first published: Friday, February 10, 2023, 15:10 [IST]
Other articles published on Feb 10, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+