
ధోనీ సారథ్యంలో ఓటమి..
సౌతాఫ్రికా జట్టు డుప్లెసిస్ కెప్టెన్సీలో తొలిసారిగా 2015లో భారత్‌లో టీ20 సిరీస్ ఆడింది. ధోనీ నాయకత్వంలోని భారత జట్టు తొలి టీ20లో ఓటిపాలైంది. రెండో టీ20లో భారత్ 92 పరుగులకే కుప్పకూలగా... దక్షిణాఫ్రికా 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. మూడో టీ20 వర్షం కారణంగా రద్దయ్యింది. దాంతో సిరీస్ కోల్పోవాల్సి వచ్చింది. 2019లో మూడు టీ20ల సిరీస్‌లో తొలి మ్యాచ్ రద్దు కాగా.. రెండో టీ20లో కోహ్లి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి గెలిపించగా.. మూడో టీ20లో కెప్టెన్ డికాక్ అజేయ అర్ధ శతకంతో దక్షిణాఫ్రికాను గెలిపించాడు. దీంతో సిరీస్ సమం అయ్యింది.

తొలి కెప్టెన్‌గా..
2022 జూన్‌లో సౌతాఫ్రికా జట్టు భారత గడ్డ మీద ఐదు టీ20ల సిరీస్ ఆడింది. రిషభ్ పంత్ కెప్టెన్సీలో బరిలోకి దిగిన భారత జట్టు 2-2తో సిరీస్‌ను సమం చేసింది. ఆఖరి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. తాజాగా సౌతాఫ్రికాపై టీ20 సిరీస్ గెలవడంతో.. సేన (సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాలపై అంతర్జాతీయ టీ20 సిరీస్ గెలిచిన కెప్టెన్‌గా రోహిత్ రికార్డ్ క్రియేట్ చేశాడు.

రోహిత్ రికార్డుల మోత..
రోహిత్ శర్మకు ఇది 400వ టీ20 మ్యాచ్ కాగా.. ఓ సంవత్సరంలో అంతర్జాతీయ టీ20ల్లో 500 రన్స్ చేసిన తొలి భారత కెప్టెన్‌గా హిట్ మ్యాన్ నిలిచాడు. 2021 వరల్డ్ కప్ తర్వాత రోహిత్ కెప్టెన్సీలో భారత జట్టు ఆరు ద్వైపాక్షిక టీ20 సిరీస్‌ల్లో విజయం సాధించింది. ఇంగ్లండ్, వెస్టిండీస్‌లు వారి సొంత గడ్డ మీద భారత జట్టు ఓడించింది.

బౌండరీల మోత.. సిక్సర్ల జాతర..
ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 237 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్(22 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో 61) ఆకాశమే హద్దుగా చెలరేగగా.. కేఎల్ రాహుల్(28 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 57), విరాట్ కోహ్లీ(28 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 49 నాటౌట్), రోహిత్ శర్మ(37 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 43) కీలక ఇన్నింగ్స్ ఆడారు. సౌతాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహరాజ్ ఒక్కడే రెండు వికెట్లు తీయగా.. మిగతా బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. పోటీపడి మరీ పరుగిలిచ్చారు.

మిల్లర్ సెంచరీ..
అనంతరం లక్ష్యచేధనకు దిగిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 221 పరుగులే చేసింది. డేవిడ్ మిల్లర్(47 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్‌లతో 106 నాటౌట్) అజేయ సెంచరీతో చెలరేగగా.. క్వింటన్ డికాక్(48 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 69 నాటౌట్) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఈ ఇద్దరు నాలుగో వికెట్‌కు అజేయంగా 174 పరుగులు జోడించారు. భారత్‌కు విజయానందమే లేకుండా చేశారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ 2 వికెట్లు తీసినా... 62 పరుగులు సమర్పించుకున్నాడు. అక్షర్ పటేల్ ఓ వికెట్ పడగొట్టాడు. దీపక్ చాహర్(0/24) మినహా అంతా ధారళంగా పరుగులిచ్చారు. మూడో టీ20 మంగళవారం ఇండోర్ వేదికగా జరగనుంది.


Click it and Unblock the Notifications
