Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

T20 WC 2024: రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ!

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సైతం అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికాడు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ బాటలోనే పొట్టి ఫార్మాట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. టీ20 ప్రపంచకప్ 2024 విజయానంతరం ముందుగా విరాట్ కోహ్లీ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెల్లడించాడు. భవిష్యత్తు తరాల కోసం అంతర్జాతీయ టీ20ల నుంచి తప్పుకుంటున్నానని తెలిపాడు.

ఆ కొద్ది సేపటికే విరాట్ కోహ్లీని అనుసరిస్తూ రోహిత్ శర్మ కూడా తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెల్లడించాడు. శనివారం ఉత్కంఠగా సాగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియా 7 పరుగుల తేడాతో సౌతాఫ్రికాను ఓడించి విశ్వవిజేతగా నిలిచింది. 11 ఏళ్ల ఐసీసీ టైటిల్ నిరీక్షణకు తెరదించింది. ఈ మ్యాచ్ అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్న రోహిత్ శర్మ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు.

Rohit Sharma announces

'ఈ ప్రపంచకప్ ఫైనల్ నా చివరి మ్యాచ్. నిజాయితీగా చెబుతున్నా ఈ ఫార్మాట్‌ ఆడుతున్నప్పటి నుంచి ఆటను చాలా ఆస్వాదించాను. ఈ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికేందుకు ఇంతకు మించిన మంచి సమయం లేదు. నా టీ20 కెరీర్‌లో ప్రతీ మూమెంట్‌ను ఆస్వాదించాను. ఈ ఫార్మాట్‌తోనే టీమిండియా తరఫున నా అంతర్జాతీయ కెరీర్ మొదలైంది. ప్రపంచకప్ గెలవాలనుకున్నాను. గెలిచాను కాబట్టి గుడ్ బై చెబుతున్నాను.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. ఈ ఫార్మాట్‌లో కొనసాగాలని రిపోర్టర్‌లు సూచించినా రోహిత్ శర్మ పట్టించుకోలేదు.

2007 టీ20 ప్రపంచకప్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రోహిత్ శర్మ.. 17 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణానికి ముగింపు పలికాడు. ఫైనల్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 176 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(59 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 76) హాఫ్ సెంచరీతో సత్తా చాటగా.. అక్షర్ పటేల్(31 బంతుల్లో ఫోర్, 4 సిక్స్‌లతో 47)కీలక ఇన్నింగ్స్ ఆడాడు. సౌతాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహారాజ్(2/23), అన్రిచ్ నోర్కియా(2/26) రెండేసి వికెట్లు తీయగా.. మార్కో జాన్సెన్, కగిసో రబడా తలో వికెట్ తీసారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన సౌతాఫ్రికా.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 165 పరుగులు చేసి ఓటమిపాలైంది. హెన్రీచ్ క్లాసెన్(27 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లతో 52) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగగా.. క్వింటన్ డికాక్(31 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 39), ట్రిస్టన్ స్టబ్స్ కీలక ఇన్నింగ్స్ ఆడారు. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా(3/20) మూడు వికెట్లు తీయగా.. జస్‌ప్రీత్ బుమ్రా(2/18), అర్ష్‌దీప్ సింగ్(2/20) రెండేసి వికెట్లు పడగొట్టారు. అక్షర్ పటేల్ ఓ వికెట్ తీసాడు.

Story first published: Sunday, June 30, 2024, 2:31 [IST]
Other articles published on Jun 30, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+