Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రెండోసారి తండ్రైన రోహిత్ శర్మ.. మగబిడ్డకు జన్మనిచ్చిన రితికా!

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రెండో సారి తండ్రయ్యాడు. అతని సతీమణి రితికా సజ్దే పండటి మగబిడ్డకు జన్మనిచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై రోహిత్ శర్మ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ ఎక్స్‌వేదికగా రోహిత్ శర్మకు రెండో సంతానంగా మగ బిడ్డ పుట్టాడని జోరుగా చర్చ జరుగుతోంది.

రోహిత్ శర్మ అభిమానులు.. తమ ఆరాధ్య క్రికెటర్‌కు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలుపుతున్నారు. రితికా సజ్దే డెలివరీ కోసమే రోహిత్ శర్మ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లలేదు. డెలివరీ సమయంలో పక్కనే ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నాడు. దాంతోనే రితికా గర్భవతి అనే విషయం తెలిసింది. అయితే ఈ విషయంపై రోహిత్ శర్మ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

Rohit Sharma and Wife Ritika Sajdeh Blessed With Baby Boy Reports

రితికా సజ్డేను రోహిత్ శర్మ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 2015 డిసెంబరు 13న వీరికి వివాహం జరగ్గా.. 2018 డిసెంబర్ 30న సమైరా పుట్టింది.
టీమిండియా దిగ్గజం, మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్...ఈ ఇద్దరినీ ఒకరికొకరిని పరిచయం చేశాడు. ఈ పరిచయం ప్రేమగా మారి పరిణయానికి దారి తీసింది. 'మీరిద్దరూ పెళ్లి చేసుకుంటే బాగుంటుంది'అని యువీ సరదాగా అన్న మాటను ఈ ఇద్దరూ నిజం చేశారు. తాను, రితికా ఒక్కటవ్వడంలో యువరాజ్‌‌దే కీలక పాత్ర అని రోహిత్ చాలా ఇంటర్వ్యూల్లో చెప్పాడు.

రితికా సజ్డే.. యువరాజ్ సింగ్ వద్ద మేనేజర్‌గా పనిచేసే సమయంలో రోహిత్ శర్మకు పరిచియమైంది. ఆ తర్వాత రోహిత్ శర్మకు రితికా మేనేజర్‌గా కూడా పని చేసింది. విరాట్ కోహ్లీ వద్ద కూడా రితికా మేనేజర్‌గా పనిచేసింది. రోహిత్‌తో వివాహం అనంతరం తన ప్రోఫెషన‌ల్ కెరీర్‌కు రితికా గుడ్‌బై చెప్పింది. భారత్‌లో రోహిత్ శర్మ ఆడే ప్రతీ మ్యాచ్‌కు హాజరయ్యే రితికా.. ఈ మధ్య క్రికెట్‌కు దూరంగా ఉంది. ఐపీఎల్ 2024 సీజన్ సందర్భంగా చివరిసారిగా కనిపించింది.

Story first published: Saturday, November 16, 2024, 0:05 [IST]
Other articles published on Nov 16, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+