Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

క్రికెట్‌కు కోహ్లీ, రోహిత్.. 2 నెలలు దూరం! మళ్లీ ఎప్పుడు ఆడుతారంటే?

ఇంగ్లండ్‌ పర్యటనను టీమిండియా ఓటమితో ముగించింది. ఆదివారం ఐకానిక్ లార్డ్స్ మైదానం వేదికగా జరిగిన మూడో వన్డేలో 27 పరుగుల తేడాతో టీమిండియా ఓటమిపాలైంది. రోహిత్ శర్మ(110 బంతుల్లో 17 ఫోర్లు, 5 సిక్స్‌లతో 138) సెంచరీతో చెలరేగినా.. విరాట్ కోహ్లీ(74), శుభ్‌మన్ గిల్(77) హాఫ్ సెంచరీలతో రాణించినా ఫలితం లేకపోయింది. దాంతో ఈ మూడు వన్డేల సిరీస్‌ను ఇంగ్లండ్ 2-1తో కైవసం చేసుకుంది. దాంతో 7 ఏళ్ల తర్వాత భారత్‌పై ఇంగ్లండ్ వన్డే సిరీస్ గెలిచింది.

ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ ముగియడంతో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మరో 2 నెలల పాటు ఆటకు దూరంగా ఉండనున్నారు. టీమిండియా తమ తదుపరి వన్డే సిరీస్‌ను సొంతగడ్డపై వెస్టిండీస్‌తో ఆడనుంది. సెప్టెంబర్ 27న వెస్టిండీస్‌తో ఈ మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ సెప్టెంబర్ 27న తిరువనంతపురంలో, రెండో మ్యాచ్ సెప్టెంబర్ 30 గౌహతి వేదికగా.. మూడో వన్డే అక్టోబర్ 3 న్యూ ఛడీగఢ్‌లో జరగనుంది.

Rohit Sharma and Virat Kohli s Next ODI Assignment India s Next ODI Series in september vs West Indies

ఈ రెండు నెలల బ్రేక్ సమయంలో టీమిండియా.. జింబాబ్వేతో మూడు టీ20ల సిరీస్‌, శ్రీలంకతో రెండు టెస్ట్‌ల సిరీస్ ఆడనుంది. ఆ తర్వాత వెస్టిండీస్‌తో సొంతగడ్డపై మూడు వన్డేల సిరీస్, ఐదు టీ20ల సిరీస్ జరగనున్నాయి. అక్టోబర్ చివర్లో ఐదు టీ20లు, ఐదు వన్డేలు, రెండు టీ20ల సిరీస్ కోసం టీమిండియా.. న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనుంది. న్యూజిలాండ్ పర్యటన తర్వాత భారత్ ఎక్కువ వన్డే సిరీస్‌లు ఆడనుంది. 2027 వన్డే ప్రపంచకప్ వరకు ఇది కొనసాగనుంది.

అంతర్జాతీయ టీ20లతో పాటు టెస్ట్‌లకు వీడ్కోలు పలికిన రోహిత్, కోహ్లీలు.. కేవలం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే కొనసాగుతున్న సంగతి తెలిసిందే. 2027 వన్డే ప్రపంచకప్ ఆడటమే లక్ష్యంగా ఈ ఇద్దరూ కొనసాగుతున్నారు. కోహ్లీ నిలకడగా రాణిస్తుండగా.. రోహిత్ శర్మ కూడా తన బ్యాట్‌తో విమర్శలకు చెక్ పెట్టాడు. వన్డే ప్రపంచకప్ ఆడే సత్తా తనలో ఇంకా ఉందని స్పష్టం చేశాడు. ఈ ఖాళీ సమయంలో రిథమ్ కోల్పోకుండా కోహ్లీ, రోహిత్‌లు ప్రాక్టీస్ చేయనున్నారు.

Story first published: Monday, July 20, 2026, 15:41 [IST]
Other articles published on Jul 20, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+