Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs SA: కోహ్లీ, రోహిత్ రీఎంట్రీ.. నో హార్దిక్! సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ ఆడే భారత జట్టు ఇదే!

సౌతాఫ్రికాతో రెండు టెస్ట్‌ల సిరీస్ ముగిసిన వెంటనే టీమిండియా మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. నవంబర్ 30న రాంచీ వేదికగా జరిగే తొలి మ్యాచ్‌‌తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. గౌహతి వేదికగా జరిగే రెండో టెస్ట్ నవంబర్ 26న ముగియనుండగా.. నాలుగు రోజుల వ్యవధిలోనే వన్డే సిరీస్ మొదలవ్వనుంది.

ఈ సిరీస్‌ ఆడే భారత జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) త్వరలోనే ప్రకటించనుంది. టీమిండియా స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ‌తో రీఎంట్రీ ఇవ్వనుండగా.. స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా బరిలోకి దిగడంపై సందేహాలు నెలకొన్నాయి. ఆసియా కప్ సందర్భంగా గాయపడిన హార్దిక్ పాండ్యా.. ఆస్ట్రేలియా పర్యటనకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.

Rohit Sharma and Virat Kohli Return as India ODI Squad for South Africa Hardik Pandya Misses Out

దేశవాళీ క్రికెట్ ఆడి..

గాయం నుంచి పూర్తిగా కోలుకున్న హార్దిక్ పాండ్యా.. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఫిట్‌నెస్ సాధించేందుకు శ్రమిస్తున్నాడు. భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చే ముందు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ‌లో హార్దిక్ పాండ్యా ఫామ్ నిరూపించుకోనున్నాడు. నవంబర్ 26న జరిగే మొదటి మ్యాచ్‌ లేదా నవంబర్ 28న జరిగే రెండవ మ్యాచ్‌లో బరోడా తరఫున హార్దిక్ బరిలోకి దిగే అవకాశం ఉంది.

హార్దిక్ పాండ్యా, శ్రేయస్ అయ్యర్ మినహా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన భారత వన్డే జట్టులో పెద్దగా మార్పులు జరిగే అవకాశం లేదు. ఈ వన్డే సిరీస్ ముగిసిన వెంటనే ఐదు టీ20ల సిరీస్ జరిగే అవకాశం ఉంది. ఈ సిరీస్ నేపథ్యంలో వన్డే సిరీస్ నుంచి హార్దిక్ పాండ్యాతో పాటు జస్‌ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినివ్వనున్నారు.

కెప్టెన్‌గా రోహిత్ శర్మ..?

మెడ నొప్పితో బాధపడుతున్న శుభ్‌మన్ గిల్‌కు వన్డే సిరీస్ నుంచి విశ్రాంతి ఇస్తారా? లేక కొనసాగిస్తారా? అనేది చూడాలి. ఒకవేళ ఈ సిరీస్‌కు అతను దూరమైతే రోహిత్ శర్మ మళ్లీ జట్టును నడిపించే అవకాశం ఉంది. ఎందుకంటే వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా గాయంతో జట్టుకు దూరమయ్యాడు. అతని స్థానంలో రుతురాజ్ గైక్వాడ్‌కు అవకాశం దక్కవచ్చు.

పేసర్లుగా ప్రసిధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్‌లో ముగ్గురికి మాత్రమే అవకాశం దక్కనుంది. స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా వరుణ్ చక్రవర్తీ, కుల్దీప్ యాదవ్‌ కొనసాగనున్నారు. స్పిన్ ఆల్‌రౌండర్స్‌గా అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ బరిలోకి దిగనున్నారు. వికెట్ కీపర్‌గా కేఎల్ రాహుల్ ఆడనుండగా.. అతనికి బ్యాకప్‌గా రిషభ్ పంత్ రీఎంట్రీ ఇవ్వవచ్చు. ఎక్స్‌ట్రా బ్యాటర్‌గా యశస్వి జైస్వాల్ అవకాశం అందుకోనున్నాడు. పేస్ ఆల్‌రౌండర్లు శివమ్ దూబే, నితీష్ కుమార్ రెడ్డిలో ఒకరికి చోటు దక్కనుంది.

సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ ఆడే భారత జట్టు(అంచనా)

శుభ్‌మన్ గిల్/యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే/నితీష్ కుమార్ రెడ్డి, మహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తీ, నితీష్ రాణా/ప్రసిధ్ కృష్ణ.

Story first published: Tuesday, November 18, 2025, 16:47 [IST]
Other articles published on Nov 18, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+