IND vs NZ: మీకు గుండ్లు కొట్టడం ఖాయం.. రోహిత్, కోహ్లీ వైఫల్యంపై ఫ్యాన్స్ సెటైర్స్!

హైదరాబాద్: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఆదిలోనే టాప్-3 వికెట్లను కోల్పోయింది. ఓపెనర్ శిఖర్ ధావన్(7)తో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ(27), మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ(9) తీవ్రంగా నిరాశపరిచారు. టీ20 ప్రపంచకప్ అనంతరం ఈ మ్యాచ్‌తోనే రీఎంట్రీ ఇచ్చిన రోహిత్, కోహ్లీ.. అభిమానుల అంచనాలను అందుకోలేకపోయారు. దాంతో భారత్ 49 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వైఫల్యంపై అభిమానులు ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
షకీబ్ అల్ హసన్ డబుల్ స్ట్రైక్..
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఒకే ఓవర్‌లో ఔటవ్వడం అభిమానులను మరింత అసంతృప్తికి గురి చేస్తోంది. పవర్ ప్లే అనంతరం షకీబ్ అల్ హసన్ వేసిన 11వ ఓవర్‌లో ఈ ఇద్దరూ బంతి వ్యవధిలో వెనుదిరిగారు. ముందుగా షకీబ్ వేసిన అద్భుత బంతికి రోహీత్ క్లీన్ బౌల్డ్ అవ్వగా.. తర్వాత లిటన్ దాస్ కళ్లు చెదిరే క్యాచ్‌కు విరాట్ పెవిలియన్ బాట పట్టాడు. షకీబ్ వేసిన మూడో బంతిని ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ డెలివరీగా భావించి రోహిత్ డిఫెన్స్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ ఆ బంతి కాస్త టర్న్ తీసుకొని రోహిత్ బ్యాట్‌కు ఎడ్జ్ తీసుకొని వికెట్లను గీరాటేసింది. షకీబ్ వేసిన నాలుగో బంతిని విరాట్ కవర్ డ్రైవ్ షాట్ ఆడగా.. లిటన్ దాస్ ఫుల్ లెంగ్త్ డైవ్‌తో ఒంటి చేత్తో బంతిని అందుకున్నాడు. అతని అసాధారణ ఫీల్డింగ్‌కు విరాట్ బిత్తరపోయాడు.
గుండ్లు కొట్టడం ఖాయం..
బంగ్లాదేశ్‌పై సెంచరీలు సాధిస్తారనుకున్న రోహిత్, విరాట్ తీవ్రంగా నిరాశపరచడంతో సోషల్ మీడియా వేదికగా అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఫన్నీ మీమ్స్‌తో ఓ ఆట ఆడుకుంటున్నారు. మరోసారి భారత ఆటగాళ్లకు బంగ్లాదేశ్ ఫ్యాన్స్ గుండ్లు కొట్టించడం ఖాయమని హెచ్చరిస్తున్నారు. 2015లో ధోనీ సారథ్యంలోని భారత్ 1-2తో బంగ్లా చేతిలో సిరీస్ కోల్పోయింది. అప్పుడు ఆ దేశ ఫ్యాన్స్.. భారత ఆటగాళ్లకు గుండ్లు కొట్టించిన పోస్టర్లు ప్రదర్శించారు. అప్పట్లో ఇది తీవ్ర దుమారం రేపింది. తాజాగా కోహ్లీ, రోహిత్ విఫలమవ్వడంతో మళ్లీ ఆ సీన్స్ రిపీట్ అవుతాయని కామెంట్ చేస్తున్నారు.
స్పిన్ ఆడలేకనే..
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ స్పిన్ ఆడటంలో తడబడుతున్నారనే విషయం మరోసారి స్పష్టమైందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. రోహిత్, కోహ్లీ ఔటవ్వడంతో మ్యాచ్ చూసే ఆసక్తి పోయిందని మరికొందరు ట్వీట్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం ద్వైపాక్షిక సిరీస్‌ల్లో భారత్ ఓడితేనే మంచిదని, తద్వారా లోపాలు బయటపడి మరింత బలంగా తయారవ్వచ్చని పేర్కొంటున్నారు. ప్రతీ ఒక్కడు జాంటీ రోడ్ అయితే బ్యాటర్లు ఎలా ఆడాలని ప్రశ్నిస్తున్నారు. బంగ్లాదేశ్ సిరీస్ ఓటమి అనంతరం హార్దిక్ పాండ్యా పూర్తి స్థాయి పరిమిత ఓవర్ల కెప్టెన్ అవుతాడని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications