ఇదెక్కడి ట్విస్ట్ రా అయ్యా.. పాకిస్థాన్ జట్టులో రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్..!
పాకిస్థాన్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో విచిత్రకర ఘటన చోటు చేసుకుంది. బ్లండర్ మిస్టేక్‌తో ఈ సిరీస్‌కు అధికారిక బ్రాడ్‌కాస్టర్‌గా వ్యవహరిస్తున్న ఫాక్స్ క్రికెట్ నవ్వులపాలైంది. ఈ మ్యాచ్ రెండో రోజైన శనివారం ఆటలో భాగంగా పాకిస్తాన్ ఆటగాళ్ల గణాంకాలు చూపించినప్పుడు.. స్క్రీన్‌పై భారత ఆటగాళ్ల పేర్లు కనిపించాయి.
పాకిస్థాన్ జట్టులో రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, తిలక్ వర్మ, శివమ్ దూబే, జితేష్ శర్మ, రింకు సింగ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ముకేశ్ కుమార్ వంటి భారత స్టార్ క్రికెటర్ల పేర్లు కనిపించడంతో ప్రేక్షకులు స్టన్ అయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ నెట్టింట వైరల్ అయ్యాయి.
ఘోర తప్పిదం చేసిన 'ఫాక్స్ క్రికెట్'ను నెటిజన్లు ఓ ఆట ఆడుకుంటున్నారు. రోహిత్ శర్మను పాకిస్థాన్ కెప్టెన్ చేసి ఆ జట్టు గెలిచినట్లు చూపించండని సెటైర్లు పేల్చుతున్నారు. ఈ టెస్ట్ మ్యాచ్ ప్రారంభానికి ముందు ఇరు జట్లు ఆరు నెలలుగా టెస్ట్ క్రికెట్ ఆడలేదు. పాకిస్థాన్ జట్టు ఆటగాళ్లు ఇటీవల ముగిసిన పాకిస్తాన్ సూపర్ లీగ్‌తో పాటు టీ20 సిరీస్‌లు ఆడగా.. బంగ్లాదేశ్ మాత్రం మూడు ఫార్మాట్లు ఆడింది.

ఈ మ్యాచ్‌కు చివరి నిమిషంలో బాబర్ ఆజాం మోకాలి గాయంతో దూరమయ్యాడు. మిర్పూర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ 413 పరుగుల భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ షాంటో(101) సెంచరీతో సత్తా చాటగా.. మోమినుల్ హక్(91), ముష్పికర్ రహీమ్(71) శతకాలను చేజార్చుకున్నారు. పాకిస్థాన్ బౌలర్లలో మహమ్మద్ అబ్బాస్(5/92) ఐదు వికెట్లు తీయగా.. షాహిన్ షా అఫ్రిది(3/113) మూడు వికెట్లు పడగొట్టాడు. హసన్ అలీ, నొమన్ అలీ తలో వికెట్ తీసారు.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్థాన్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 46 ఓవర్లలో వికెట్ నష్టానికి 179 పరుగులు చేసింది. అజన్ అవైస్(85 బ్యాటింగ్), అబ్దుల్లా ఫజల్(37 బ్యాటింగ్) క్రీజులో ఉండగా.. ఇమామ్ ఉల్ హక్(45) ఔటయ్యాడు. మెహ్‌ది హసన్ మీరాజ్‌కు ఒక వికెట్ దక్కింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications