Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs WI: ఊచకోత.. సెంచరీలతో చెలరేగిన రోహిత్ , శుభ్‌మన్ గిల్!

టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ సెంచరీలతో కదం తొక్కారు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా గౌహతి వేదికగా బుధవారం జరిగిన రెండో మ్యాచ్‌లో విధ్వంసకర శతకాలతో చెలరేగారు. 406 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు తగ్గట్లుగా అదిరిపోయే ఆరంభాన్ని అందించారు.

ఇన్నింగ్స్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడారు. భారీ సిక్స్‌లతో వెస్టిండీస్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో 32 బంతుల్లో రోహిత్ శర్మ.. 38 బంతుల్లో శుభ్‌మన్ గిల్ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. దాంతో పవర్ ప్లేలో భారత్ వికెట్ నష్టపోకుండా 92 పరుగులు చేసింది.

Rohit Sharma and Shubman Gill Hit Stunning Centuries in India vs West Indies 2nd ODI

అనంతరం గిల్ దూకుడుగా ఆడగా.. రోహిత్ శర్మ కాస్త వేగం తగ్గించాడు. ఈ జోడీని విడదీసేందుకు వెస్టిండీస్ కెప్టెన్ చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ప్రతీ ఓవర్‌లో పోటాపడి బౌండరీలు బాదారు. ఈ క్రమంలో శుభ్‌మన్ గిల్ 62 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకోగా.. రోహిత్ శర్మ 72 బంతుల్లో శతకాన్ని అందుకున్నాడు. సెంచరీ అనంతరం శుభ్‌మన్ గిల్ మరింత ధాటిగా ఆడాడు. భారీ సిక్స్‌లతో విరుచుకుపడ్డాడు. రోహిత్ శర్మ మాత్రం జైడన్ సీల్స్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దాంతో తొలి వికెట్‌కు నమోదైన 255 పరుగుల భారీ భాగస్వామ్యానికి తెరపడింది.

క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ సైతం దూకుడుగా ఆడాడు. కానీ భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. అల్జారీ జోసెఫ్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. దాంతో రుతురాజ్ గైక్వాడ్‌తో కలిసి శుభ్‌మన్ గిల్ చెలరేగాడు. 117 బంతుల్లో డబుల్ సెంచరీ సాధించాడు. దాంతో అత్యంత వేగంగా డబుల్ సెంచరీ బాదిన బ్యాటర్‌గా శుభ్‌మన్ గిల్ చరిత్ర సృష్టించాడు.

ఈ క్రమంలో ఇషాన్ కిషన్ పేరిట ఉన్న ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ రికార్డ్‌ను అధిగమించాడు. ఇషాన్ కిషన్ 126 బంతుల్లో బంగ్లాదేశ్‌పై డబుల్ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. రోహిత్ శర్మ తర్వాత మల్టీపుల్ డబుల్ సెంచరీలు బాదిన ఆటగాడిగా శుభ్‌మన్ గిల్ నిలిచాడు.

వన్డేల్లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీలు..

117 శుభ్‌మన్ గిల్ vs వెస్టిండీస్, గౌహతి 2026*

126 ఇషాన్ కిషన్ vs బంగ్లాదేశ్, చట్టోగ్రామ్ 2022

128 గ్లేన్ మాక్స్‌వెల్ vs అఫ్ఘనిస్తాన్, వాంఖేడే 2023

136 పాతుమ్ నిస్సంక vs ఆఫ్ఘనిస్తాన్, పల్లెకెలె 2024

138 క్రిస్ గేల్ vs జింబాబ్వే, కాన్‌బెర్రా 2015

Story first published: Wednesday, September 30, 2026, 21:06 [IST]
Other articles published on Sep 30, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+