Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AUS: కోహ్లీ డకౌట్.. ఆదుకున్న రోహిత్, అయ్యర్!

ఆస్ట్రేలియాతో రెండో వన్డేలో టీమిండియా 265 పరుగుల లక్ష్యాన్ని నమోదు చేసింది. రోహిత్ శర్మ(97 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 73), శ్రేయస్ అయ్యర్(77 బంతుల్లో 7 ఫోర్లతో 61) హాఫ్ సెంచరీలతో రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 264 పరుగులు చేసింది.

అక్షర్ పటేల్(41 బంతుల్లో 5 ఫోర్లతో 44), హర్షిత్ రాణా(18 బంతుల్లో 3 ఫోర్లతో 24 నాటౌట్) విలువైన పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపా(4/60) నాలుగు వికెట్లు తీయగా.. గ్జేవియర్ బార్ట్‌లెట్(3/36) మూడు వికెట్లు పడగొట్టాడు. మిచెల్ స్టార్క్‌కు ఓ వికెట్ దక్కింది.


నిరాశపర్చిన గిల్, కోహ్లీ..

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు శుభారంభం దక్కలేదు. టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్(9), విరాట్ కోహ్లీ(0)మరోసారి తీవ్రంగా నిరాశపర్చాడు. ఏడో ఓవర్‌ తొలి బంతికి శుభ్‌మన్ గిల్(9)ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చిన గ్జేవియర్ బార్ట్‌లెట్.. ఐదో బంతికి విరాట్ కోహ్లీని వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. దాంతో 17 పరుగులకే టీమిండియా రెండు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.ఈ పరిస్థితుల్లో శ్రేయస్ అయ్యర్‌తో కలిసి రోహిత్ శర్మ ఆచితూచి ఆడాడు. దాంతో పవర్ ప్లేలో టీమిండియా 2 వికెట్లకు 29 పరుగులే చేసింది.

Rohit Sharma and Shreyas Iyer s Half-Centuries Propel India to 264 9 Against Australia

రోహిత్ హాఫ్ సెంచరీ..

రోహిత్ శర్మ తన శైలికి భిన్నంగా ఆడాడు. పిచ్ కండిషన్స్ గౌరవిస్తూ ఆచితూచి పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలో 74 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం కాస్త దూకుడుగా ఆడిన రోహిత్ శర్మ(73)ను మిచెల్ స్టార్క్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో మూడో వికెట్‌కు నమోదైన 118 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

క్రీజులోకి అక్షర్ పటేల్ రాగా.. శ్రేయస్ అయ్యర్ 67 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతన్ని ఆడమ్ జంపా క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కేఎల్ రాహుల్(11)‌ను కూడా ఆడమ్ జంపా క్లీన్ బౌల్డ్ చేయగా.. వాషింగ్టన్ సుందర్‌(12)ను బార్ట్‌లెట్ పెవిలియన్ చేర్చాడు.

రాణించిన హర్షిత్ రాణా..

ఓవైపు వికెట్లు పడుతున్నా.. మరోవైపు అక్షర్ పటేల్ తనదైన బ్యాటింగ్‌తో చెలరేగాడు. హాఫ్ సెంచరీకి చేరువైన అతన్ని జంపా పెవిలియన్ చేర్చాడు. నితీష్ కుమార్ రెడ్డి(8) నిరాశపర్చగా.. అర్ష్‌దీప్ సింగ్ సాయంతో హర్షిత్ రాణా జట్టు స్కోర్‌ను 250 ధాటించాడు. క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్‌తో కలిసి రోహిత్ శర్మ(73) జట్టును ఆదుకున్నాడు. 74 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న రోహిత్ శర్మ.. స్టార్క్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. మూడో వికెట్‌కు 118 పరుగులు జోడించాడు.

Story first published: Thursday, October 23, 2025, 13:08 [IST]
Other articles published on Oct 23, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+