కంగ్రాట్స్ చాహల్.. కొన్ని గూగ్లీలు ఉంచుకో: రోహిత్ శర్మ

మెల్‌బోర్న్: క్రికెటర్ యుజువేంద్ర చాహల్ యూట్యూబర్ ధనశ్రీ వర్మను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. గురుగ్రామ్‌లో వీరి వివాహం కొద్దిమంది కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య మంగళవారం ఘనంగా జరిగింది. తమ వివాహ ఫొటోలను చాహల్ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నాడు. వివాహంతో ఓ ఇంటివాడైన చాహల్‌కు మాజీ క్రికెటర్లు, సహచర ఆటగాళ్లు, అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ చేసిన ట్వీట్ వైరల్ అయింది. అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.

గూగ్లీలు దాచుకో బ్రో..
‘కంగ్రాట్స్ బ్రో.. మీ ఇద్దరికి శుభాకాంక్షలు. ఆమె కోసం కాకుండా.. ప్రత్యర్థుల కోసం కొన్ని గూగ్లీలు దాచుకో'అని తనదైన శైలిలో హిట్‌మ్యాన్ ట్వీట్ చేశాడు. భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూడా చాహల్ జోడీకి శుభాకాంక్షలు తెలిపాడు. జీవితాంతం సంతోషంగా ఉండాలని ఆకాంక్షించాడు. ఈ ఇద్దరితో పాటు నవ్‌దీప్ సైనీ, హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్, సురేశ్ రైనా ఇతర ఆటగాళ్లు కూడా యూజీకి విషెస్ తెలియజేశారు. క్రిస్ గేల్, కర్ణ్ శర్మ, రోహిత్ శర్మ భార్య రితికా, హార్దిక్ సతీమణి నటాషా కూడా శుభాకాంక్షలు తెలిపారు.

ఇద్దరం ఒకటయ్యాం
మంగళవారం యుజువేంద్ర చాహల్ తన ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్ ఖాతాలో పెళ్లిఫొటోలు పంచుకున్నాడు. 'గతంలో మా పరిచయం ఏర్పడింది, మేం ఎప్పుడూ సంతోషంగా ఉంటామని తెలుసుకున్నాం. ఇద్దరం ఒకటయ్యాం' అని దానికి కాప్షన్ జత చేశాడు. లాక్‌డౌన్‌లో చాహల్, ధనశ్రీకి నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. మా కుటుంబాలతో పాటు మేమిద్దరమూ 'అవును' అనేశామని అప్పట్లో సోషల్ మీడియాలో వీరు ప్రకటించారు.

కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా
ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్‌కు యుజువేంద్ర చాహల్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. కరోనా కారణంగా ఐపీఎల్ 2020 దుబాయ్‌కు షిఫ్టవగా.. కాబోయే భర్తతో పాటు ధనశ్రీ కూడా యూఏఈ వెళ్లింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా కూడా వెళ్లారు. అయితే ఆసీస్ పర్యటనలో చాహల్ ప్రదర్శన నిరాశపరిచింది. రెండు వన్డేల్లో ఒక్క వికెట్ మాత్రమే తీసి 160 పరుగులు సమర్పించుకున్నాడు. అయితే తొలి టీ20లో రవీంద్ర జడేజాకు బదులు కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగిన చాహల్ నాలుగు ఓవర్లు వేసి 25 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు.

అల్లరి క్రికెటర్
భారత వన్డే, టీ20 జట్టులో రెగ్యులర్ స్పిన్నర్‌గా కొనసాగుతున్న యుజువేంద్ర చాహల్‌కి టెస్టుల్లో మాత్రం అవకాశాలు దక్కడం లేదు. అయినప్పటికీ నిరాశ చెందకుండా ఛాన్స్ దొరికిన మ్యాచ్‌లో సత్తా చాటుతున్నాడు. వన్డే, టీ20ల్లో తన మాయాజాలంతో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. టీమిండియా అల్లరి కుర్రాడు చాహల్ మైదానంలో ఎంతో సరదాగా ఉంటాడు. ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ కబుర్లు చెబుతుంటాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం 'చాహల్ టీవీ'తో ఆటగాళ్లను సరదాగా ఇంటర్వ్యూ చేస్తుంటాడు. ఇక సోషల్ మీడియా వేదికగా అతను చేసే రచ్చ మాములుగా ఉండదు. ప్రేమ వ్యవహారాన్ని బయటపెట్టినప్పటికీ.. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే పెళ్లి చేసుకోవడం అందర్ని ఆశ్చర్యపరిచింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications