Ind vs Pak T20 World Cup: నట్టేట ముంచేసారు కదయ్యా రాహులూ, రోహితూ! మండిపడుతున్న ఫ్యాన్స్!

దుబాయ్: 'క్లాస్‌లో ఎవడైనా ఆన్సర్ చెబుతాడు సర్. కానీ పరీక్షల్లో రాసినోడే టాపర్ అవుతాడు' జులాయి సినిమాలో అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్.. ఇది టీమిండియా స్టార్ ఓపెనర్లు కేఎల్ రాహుల్, రోహిత్ శర్మకు సరిగ్గా సరిపోతుంది. అవును ప్రపంచకప్ ఫైనల్ కంటే ఎక్కువ భావించే అసలు సిసలు భారత్-పాక్ మ్యాచ్‌లో ఈ ఇద్దరు దారుణంగా విఫలమయ్యారు. ఫస్ట్ ఓవర్‌లోనే రోహిత్ శర్మ గోల్డెన్ డక్‌గా.. మూడో ఓవర్‌లో కేఎల్ రాహుల్(3) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. పాకిస్థాన్ యువ పేసర్ షాహిన్ షా అఫ్రిదీ పేస్‌కు ఈ ఇద్దరు విలవిలలాడారు.
ఐపీఎల్, వామప్ మ్యాచ్‌ల్లో క్లాస్ బ్యాటింగ్‌తో కేఎల్ రాహుల్ దుమ్మురేపగా.. ఆస్ట్రేలియాతో జరిగిన సన్నాహక మ్యాచ్‌లో రోహిత్ శర్మ హాఫ్ సెంచరీతో టచ్‌లోకి వచ్చాడు. దాంతో ఈ బిగ్ మ్యాచ్‌లో ఈ ఇద్దరు చెలరేగడం ఖాయమని అంతా భావించారు. కానీ ఒత్తిడికి చిత్తయిన ఈ జోడీ ఆరంభంలోనే వికెట్లను పారేసుకొని వెనుదిరిగారు. దాంతో ఈ ఇద్దరిపై భారత అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నట్టేట ముంచేసారు కదా..
సోషల్ మీడియా వేదికగా ఈ ఇద్దరిపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఫన్నీ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. రోహిత్ శర్మ వడపావ్ తినాలని ఒకరంటే.. నట్టేట ముంచేసాడని మరొకరు కామెంట్ చేస్తున్నారు. రోహిత్ శర్మ ఇలా ఆడుతాడని అస్సలు ఊహించలేదని, తన ఆటతో తీవ్రంగా హర్ట్ అయ్యామని కామెంట్ చేస్తున్నారు. అతనికి బదులు ఫామ్‌లో ఉన్న ఇషాన్ కిషన్‌ను ఆడించినా బాగుండేదని అభిప్రాయపడుతున్నారు. అసలు షాహిన్ షా అఫ్రిది బౌలింగ్‌పై హోమ్ వర్క్ చేయలేదా? అని ప్రశ్నిస్తున్నారు. టీమిండియా మేనేజ్‌మెంట్ ఏం చేస్తుందని నిలదీస్తున్నారు.
ఇలా అయితే కష్టమే..
ఇక ఓపెనింగ్ జోడీ ఇలా విఫలమైతే.. టోర్నీలో ముందంజ వేయడం కష్టమేనని అభిప్రాయపడుతున్నారు. టీ20 ఫార్మాట్‌లో ఓపెనర్లు రాణించడం చాలా ముఖ్యమని, వారు త్వరగా ఔటైతే టీమ్‌పై తీవ్ర ఒత్తిడి నెలకొంటుందంటున్నారు. ఓపెనర్ల జోడీ బాధ్యతారాహిత్యం వీడి నిలకడగా రాణించే ప్రయత్నం చేయాలంటున్నారు. లేకుంటే టోర్నీలో ముందుకు సాగడం కష్టమంటున్నారు. సూర్యకుమార్ యాదవ్ సైతం మంచి అవకాశాన్ని చేజార్చుకున్నాడని, అనవసర షాట్‌తో మూల్యం చెల్లించుకున్నాడని కామెంట్ చేస్తున్నారు.
ఆదుకున్న కోహ్లీ, పంత్
ఓపెనర్లు ఔటైన వెంటనే క్రీజులోకి వచ్చిన సూర్య తనదైన షాట్లు ఆడటంతో భారత అభిమానులంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇద్దరు ఓపెనర్లు ఔటైన షాహిన్ షా అఫ్రిది బౌలింగ్‌లోనే సూర్య సిక్స్ కొట్టి తన క్లాస్ బ్యాటింగ్‌ను చాటుకోవడంతో అభిమానులంతా అతనిపై పూర్తి భరోసా ఉంచారు. మరోవైపు కోహ్లీ సింగిల్ తీస్తూ స్ట్రైక్ రొటేట్ చేయడంతో భారత్ గట్టెక్కిందని అంతా భావించారు. కానీ హసన్ అలీ బౌలింగ్‌లో బంతిని తప్పుగా అంచనా వేసిన సూర్య కుమార్ యాదవ్(11) కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రిషభ్ పంత్‌తో కోహ్లీ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. క్రీజులో నిలదొక్కుకునేందుకు టైమ్ తీసుకున్న ఈ జోడీ.. ఆ తర్వాత తమదైన శైలిలో చెలరేగింది. ముఖ్యంగా 12వ ఓవర్‌లో రిషభ్ పంత్ కొట్టిన రెండు భారీ సిక్స్‌లు ఇన్నింగ్స్‌కే హైలైట్‌గా నిలిచాయి. అదే జోరు మరో భారీ షాట్‌కు ప్రయత్నించిన అతను క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications