రోహిత్ శర్మ బీఫ్ తింటావా? ఆ ఐదుగురిని భారత్‌కు పంపించేయండి.. ఫ్యాన్స్ ఫైర్

మెల్‌బోర్న్: బయో బబుల్ ప్రొటోకాల్ ఉల్లంఘించారనే ఆరోపణలను ఎదుర్కొంటున్న భారత జట్టు టెస్టు వైస్ కెప్టెన్ రోహిత్‌శర్మ సహా నలుగురు క్రికెటర్లు మరో వివాదంలో చిక్కుకున్నారు. ఈ ఐదుగురి క్రికెటర్లు బీఫ్, పంది మాంసం తిన్నారని సోషల్ మీడియా వేదికగా భారత అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత క్రికెటర్లపై అభిమానంతో ఒక వీరాభిమాని చేసిన పని వారికి ఈ కష్టాలను తెచ్చి పెట్టింది. ఈ అభిమానం కారణంగా ఈ ఐదుగురు క్రికెటర్లు ఐసోలేషన్‌లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
కొత్త సంవత్సరం రోజున బయటకు వెళ్లి అల్పాహారం చేసిన కారణంగా రోహిత్ శర్మ, యువ ఓపెనర్లు శుబ్‌మన్ గిల్, పృథ్వీ షా, వికెట్‌కీపర్ రిషభ్ పంత్, పేసర్ నవదీప్ సైనీలను ఐసోలేషన్‌కు తరలించినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) శనివారం వెల్లడించిన విషయం తెలిసిందే. ఆటగాళ్లు బయో బబుల్ ప్రొటోకాల్‌ను ఉల్లంఘించారా లేదా అని తెలుసుకునేందుకు బీసీసీఐ, సీఏ సంయుక్తంగా దర్యాప్తు చేపడుతున్నట్లు చెప్పింది.

రోహిత్ నువ్వో హిందువువై..
అయితే తాజాగా పంది, బీఫ్ మాంసం తిన్నారని ఈ ఐదుగురి ఆటగాళ్లపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర ట్రోలింగ్ జరుగుతుంది. వెంటనే వీరిని భారత్‌కు పంపించాలని ఓ వర్గం అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా రోహిత్ శర్మను టార్గెట్ చేస్తూ మీమ్స్, కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ బిల్‌కు సంబంధించిన ఫొటో నెట్టింట్ల హల్‌చల్ చేస్తుంది. రోహిత్ శర్మ నువ్వో హిందువువై బీఫ్ తింటావా? అని ప్రశ్నిస్తున్నారు. ‘ఏయ్ మన శర్మ బీఫ్ తిన్నాడు'అని ఒకరు కామెంట్ చేస్తే.. ‘మీ వడాపావ్ కింగ్ బీఫ్ తిన్నాడోచ్'అని ఇంకొందరు రోహిత్ ఫ్యాన్స్ టీజ్ చేస్తున్నారు.

ఇంతకేం జరిగిందంటే..
శుక్రవారం కొత్త సంవత్సరం సందర్భంగా మెల్‌బోర్న్‌లోని సమీప రెస్టారెంట్‌కు వెళ్లి భారత క్రికెటర్లు అల్పాహారం చేస్తుండగా... అక్కడే ఉన్న భారత అభిమాని ఒకరు వారికి తెలియకుండా క్రికెటర్ల బిల్లు చెల్లించాడు. ఇది తెలుసుకున్న రోహిత్ శర్మ తనను వారించినట్లు, రిషభ్ పంత్ తనను ఆలింగనం చేసుకున్నట్లు, ఆ తర్వాత క్రికెటర్లతో కలిసి ఫొటో తీసుకున్నానని ఆ అభిమాని ట్విటర్ వేదికగా పంచుకున్నాడు. ఆ ట్వీట్‌లో క్రికెటర్ల ఆహారానికి చెల్లించిన బిల్‌ను కూడా జతచేశాడు. అయితే భారత ఆటగాళ్లు ఆ బిల్‌లో పంది, బీఫ్ మాంసం తీసుకున్నట్లు స్పష్టంగా కనిపించింది. దాంతో అభిమానులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు.

ఐసోలేషన్‌లో ఐదుగురు..
బయో బబుల్ దాటి వచ్చారనే ఆరోపణలతో తాజాగా సీఏ ఈ ఐదుగురిని ఐసోలేషన్‌లో ఉంచింది. దీంతో వీరు ప్రయాణాల్లో, ప్రాక్టీస్ సమయాల్లో... మిగతా భారత జట్టుతో పాటు ఆస్ట్రేలియా ఆటగాళ్లకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. 7 నుంచి జరుగనున్న మూడో టెస్టు కోసం ఇరు జట్లు 2 రోజుల ముందుగా సిడ్నీకి వస్తాయి. ఇక తన పోస్టులు వివాదాస్పదం కావడంతో తాను కౌగిలించుకోలేదని ఆ అభిమాని క్షమాపణలు తెలియజేశాడు. తాను చెల్లించిన బిల్లుకు సైతం రోహిత్ శర్మ డబ్బులు ఇచ్చేశారని పేర్కొన్నాడు.
మంకీగేట్ పరిస్థితులను..
భారత్ బయోబుడగ నిబంధనలు ఉల్లంఘించలేదని బీసీసీఐ అధికారి ఒకరు పీటీఐకి తెలిపారు. ‘ఉద్దేశపూర్వకంగా ఎలాంటి ఉల్లంఘన జరగలేదు. మన వాళ్లకు నిబంధనల గురించి బాగా తెలుసు. వారిపై బీసీసీఐ ఎలాంటి దర్యాప్తు చేపట్టడం లేదు. రెండో టెస్టు లో భారత్ చేతిలో ఓటమి అనంతరం ఆస్ట్రేలియాలోని ఓ వర్గం మీడియా ఇలాంటి ద్వేషపూరిత వార్తలను ప్రచారం చేస్తోంది. మూడో టెస్టు ముందర భారత జట్టును కలవరపెట్టేందుకు ఇది ఓ ప్రయత్నమైతే, ఇది చాలా చెడ్డ కుట్ర అని భావించవచ్చు. ఇప్పుడు ఈ వివాదం 2007-08లో జరిగిన ‘మంకీ గేట్' నాటి పరిస్థితులను తలపిస్తోంది' అని బీసీసీఐకి చెందిన ఓ అధికారి వివరణ ఇచ్చారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications