Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ENG: సెంచరీ తర్వాత గంభీర్‌తో రోహిత్ శర్మ వాగ్వాదం!(వీడియో)

టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ విధ్వంసకర శతకంతో చెలరేగాడు. తన రిటైర్మెంట్ వార్తలకు బ్యాటింగ్‌తోనే బదులిచ్చాడు. తనలో ఇంకా ఆడే సత్తా ఉందని చాటి చెప్పాడు. లార్డ్స్ వేదికగా ఆదివారం జరిగిన మూడో వన్డేలో రోహిత్ శర్మ (110 బంతుల్లో 17 ఫోర్లు, 5 సిక్స్‌లతో 138) సెంచరీతో సత్తా చాటాడు.

రోహిత్ రిటైర్మెంట్.. తేల్చేసిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్!

రోహిత్ రిటైర్మెంట్.. తేల్చేసిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్!

ఈ మ్యాచ్‌కు ముందు ఇదే అతని ఆఖరి మ్యాచ్ అంటూ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. కానీ రోహిత్ సెంచరీ బాది లార్డ్స్‌లో ఈ ఘనత సాధించిన తొలి భారత వన్డే బ్యాటర్‌గా నిలిచాడు. 39 ఏళ్ల 80 రోజుల వయసులో సెంచరీ బాదిన భారత ఆటగాడిగా కూడా రోహిత్ నిలిచాడు. ఈ క్రమంలో సచిన్ టెండూల్కర్ రికార్డ్‌ను బద్దలు కొట్టాడు.

Rohit Sharma And Gautam Gambhir s Animated Chat After Lord s Century Over Retirement Rumours Goes viral

భారీ ఇన్నింగ్స్ దిశగా సాగిన రోహిత్ శర్మ.. దూకుడుగా ఆడే క్రమంలో జాకోబ్ బెతెల్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అనంతరం ఐకానిక్ లార్డ్స్ బాల్కానీలో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పక్కన కూర్చొని మిగతా మ్యాచ్‌ను వీక్షించాడు. ఈ సందర్భంగా గంభీర్‌తో రోహిత్ శర్మ తీవ్రంగా సంప్రదింపులు జరిపాడు. ఏదో విషయంలో ఈ ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. నెటిజన్లకు తమకు తోచిన సంభాషణను ఊహించుకుంటున్నారు.

తన సెంచరీ గురించి చెబుతూ గంభీర్‌కు రోహిత్ క్లాస్ పీకాడాని ఒకరంటే.. ఇంకాసేపు ఆడితే బాగుండని గంభీర్ అంటున్నాడని కామెంట్ చేస్తున్నారు. రిటైర్మెంట్ గురించి ఈ ఇద్దరి మధ్య చర్చ జరిగి ఉంటుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

IND vs ENG: టీమిండియాకు డబుల్ షాక్.. టి20ల తర్వాత వన్డే సిరీస్ కూడా అవుట్!

IND vs ENG: టీమిండియాకు డబుల్ షాక్.. టి20ల తర్వాత వన్డే సిరీస్ కూడా అవుట్!

2027 వన్డే ప్రపంచకప్ ప్రణాళికల నుంచి రోహిత్ శర్మను తొలగించారని, యశస్వి జైస్వాల్‌ వంటి యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని సెలెక్షన్ కమిటీ భావిస్తుందని వార్తలు వచ్చాయి. లార్డ్స్ వన్డేనే రోహిత్ శర్మకు చివరిదంటూ ప్రచారం జరిగింది. కానీ రోహిత్ అద్భుతమైన శతకంతో తన ఫామ్‌ను నిరూపించుకున్నాడు. ఇదే విషయాన్ని గంభీర్‌‌తో రోహిత్ మాట్లాడి ఉంటాడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Story first published: Monday, July 20, 2026, 11:49 [IST]
Other articles published on Jul 20, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+