Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

గంభీర్, రోహిత్ మధ్య తీవ్ర వాగ్వాదం!(వీడియో)

సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా శుభారంభం చేసింది. ఆదివారం రాంచీ వేదికగా జరిగిన తొలి వన్డేలో సమష్టిగా రాణించిన భారత్ 17 పరుగుల తేడాతో గెలుపొందింది. అయితే ఈ మ్యాచ్‌ అనంతరం టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మధ్య డ్రెస్సింగ్ రూమ్‌లో తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

గంభీర్ ఎదో చెబుతుండగా.. అందుకు రోహిత్ విభేదిస్తూ ఉండటం వీడియోలో కనిపించింది. సుదీర్ఘంగా సాగిన ఈ సంభాషణ టీవీ కెమెరాల్లో రికార్డ్ అవ్వగా.. అనేక ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. ఈ వీడియో సోషల్ మీడియా వేదికగా కొత్త చర్చను హ్యాష్ ట్యాగ్స్‌ను ట్రెండ్ చేస్తోంది.

గంభీర్, రోహిత్ మధ్య హాట్ డిబేట్..

భారత విజయానంతరం టీవీ కెమెరాలు.. డ్రెస్సింగ్ రూమ్‌ను జూమ్ చేసి చూపించాయి. ఆ సమయంలో గౌతమ్ గంభీర్, రోహిత్ శర్మ మధ్య ఏదో వాగ్వాదం జరిగింది. గంభీర్ మాటలకు వ్యతిరేకంగా గంభీర్ తల ఊపుతూ కనిపించాడు. ఈ సంభాషణ సందర్భంగా ఇద్దరూ సీరియస్‌గా ఉన్నారు. అయితే వారి మధ్య జరిగిన సంభాషణ గురించి క్లారిటీ లేదు. కానీ జట్టు గురించి ఇద్దరి మధ్య హాట్ డిబేట్ జరిగిందనే వాదన వినిపిస్తోంది.

Rohit Sharma and Gautam Gambhir s Intense Dressing-Room Exchange Trends After India s ODI Victory

టీమ్ వ్యూహాలు, భావోద్వేగాలు, జట్టు సెలెక్షన్ గురించి, సోషల్ మీడియాలో వచ్చే విమర్శల గురించి ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లుందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. మరికొందరు రోహిత్, కోహ్లీ భవితవ్యం గురించి మాట్లాడుకున్నారని కామెంట్ చేస్తున్నారు. గంభీర్, రోహిత్ మధ్య సంభాషణ గురించి క్లారిటీ లేనప్పటికీ.. వారి బాడీ లాంగ్వేజ్ చూస్తే చర్చ వేడిక్కిందనే విషయం అర్థమవుతుంది.

సీనియర్ల భవితవ్యంపై..

రోహిత్, కోహ్లీ ఇప్పటికే టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ కావడంతో వారి వన్డే భవిష్యత్తు గురించి చర్చ జరిగి ఉంటుందని కొందరు భావిస్తున్నారు. కోహ్లీ, రోహిత్ భవితవ్యంపై అజిత్ అగార్కర్ మాట్లాడనున్నాడని కూడా వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే గంభీర్, రోహిత్ శర్మ మధ్య చర్చ జరిగి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. అయితే ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ చేసినప్పుడు గంభీర్ చప్పట్లతో అభినందించాడు. కోహ్లీ సెంచరీ తర్వాత అతన్ని హగ్ చేసుకొని అభినందించాడు. అయినా రోహిత్, గంభీర్ మధ్య జరిగిన సంభాషణ మిస్టరీగా మారింది.

రోకో విధ్వంసం..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 349 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(120 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్స్‌లతో 135) సెంచరీతో చెలరేగగా.. రోహిత్ శర్మ(51 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 57), కేఎల్ రాహుల్(56 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 60) హాఫ్ సెంచరీలతో రాణించారు. సౌతాఫ్రికా బౌలర్లలో మార్కో జాన్సెన్, నండ్రే బర్గర్, కార్బిన్ బోష్, ఒట్నిల్ బార్ట్‌మన్ రెండేసి వికెట్లు తీసారు.

అనంతరం సౌతాఫ్రికా 49.2 ఓవర్లలో 332 పరుగులకు ఆలౌటైంది. మాథ్యూ బ్రిట్జ్‌కే(80 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 72), మార్కో జాన్సెన్(39 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 70), కార్బిన్ బోష్(51 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 67) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్(4/68) నాలుగు వికెట్లు తీయగా.. హర్షిత్ రాణా(3/65) మూడు వికెట్లు పడగొట్టాడు. అర్ష్‌దీప్ సింగ్(2/64)‌కు రెండు వికెట్లు దక్కాయి.

Story first published: Monday, December 1, 2025, 14:22 [IST]
Other articles published on Dec 1, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+