Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs NZ: పంత్ పెట్టించిన పంచాయితీ.. రోహిత్ శర్మ X డారిల్ మిచెల్ డిష్యూం డిష్యూం..!(వీడియో)

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ డారిల్ మిచెల్ మధ్య చిన్నపాటి వాగ్వాదం చోటు చేసుకుంది. ఇరు జట్ల మధ్య మూడు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా ముంబైలోని వాంఖడే మైదానం వేదికగా జరుగుతున్న చివరి మ్యాచ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. తొలి రోజు ఆట ఫస్ట్ సెషన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన డారిల్ మిచెల్‌ను భారత ఆటగాళ్లు రిషబ్ పంత్, సర్ఫరాజ్ ఖాన్ తమ మాటలతో కవ్వించారు.

పదే పదే స్లెడ్జింగ్ చేస్తూ అతని ఏకాగ్రతను దెబ్బతినే ప్రయత్నం చేశారు. డారిల్ మిచెల్ చుట్టూ కట్టడిగా ఫీల్డింగ్ పెట్టిన రోహిత్.. అతనిపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశాడు. మరోవైపు పంత్, సర్ఫరాజ్ ఖాన్ తరుచూ తమ మాటలతో డారిల్ మిచెల్‌ను కవ్వించారు. దాంతో సహనం కోల్పోయిన డారిల్ మిచెల్ లెగ్ అంపైర్‌కు ఫిర్యాదు చేశాడు. దాంతో కెప్టెన్ రోహిత్ శర్మ రంగంలోకి దిగి డారిల్ మిచెల్‌తో మాట్లాడాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

Rohit Sharma and Daryl Mitchell engage in intense confrontation during IND vs NZ 3rd Test Video

రవీంద్ర జడేజా వేసిన 27వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. జడేజా వేసిన నాలుగో బంతిని డారిల్ మిచెల్ సమర్థవంతంగా డిఫెన్స్ చేశాడు. అప్పటికే పంత్ తన మాటలతో డారిల్ మిచెల్‌కు చికాకు తెప్పించాడు. దాంతో ఆగ్రహానికి గురైన డారిల్ మిచె‌ల్ లెగ్ అంపైర్‌కు ఫిర్యాదు చేశాడు. దాంతో రోహిత్ శర్మ జోక్యం చేసుకున్నాడు. డారిల్ మిచెల్‌కు సర్ధిచెప్పే ప్రయత్నం చేయగా.. ఇద్దరి మధ్య వాగ్వాదం పెద్దది అయ్యింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.


ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 40 ఓవర్లలో 3 వికెట్లకు 134 పరుగులు చేసింది. తొలి సెషన్‌లోనే మూడు వికెట్లు కోల్పోయింది. వాషింగ్టన్ సుందర్ సూపర్ బౌలింగ్‌తో టామ్ లాథమ్(28), రచిన్ రవీంద్ర(5) పెవిలియన్ చేర్చాడు. ఈ సిరీస్‌లో రచిన్ రవీంద్రను వరుసగా మూడు ఇన్నింగ్స్‌ల్లో క్లీన్ బౌల్డ్ చేశాడు.

అంతకుముందు డెవాన్ కాన్వే(4)ను ఆకాశ్ దీప్ బోల్తాకొట్టించగా.. న్యూజిలాండ్ 72 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన డారిల్ మిచెల్‌తో కలిసి విల్ యంగ్ ఆచితూచి ఆడుతున్నాడు. ఇప్పటికే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న విల్ యంగ్ శతకం దిశగా సాగుతున్నాడు.

Story first published: Friday, November 1, 2024, 13:28 [IST]
Other articles published on Nov 1, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+