Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

GT vs MI Eliminator: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ

ముంబై ఇండియన్స్ స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌లో 7 వేల పరుగుల మైలురాయి అందుకున్న రెండో బ్యాటర్‌గా నిలిచాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న ఎలిమినేటర్ మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఈ ఫీట్ సాధించాడు. ఈ మ్యాచ్ ఆరంభంలోనే రోహిత్ శర్మకు రెండు లైఫ్స్ లభించాయి. ప్రసిధ్ కృష్ణ వేసిన రెండో ఓవర్‌లోనే రోహిత్ శర్మ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను గెరాల్డ్ కోయిట్జీ నేలపాలు చేశాడు. ఆ క్యాచ్ పట్టి ఉంటే రోహిత్ 4 పరుగులకే ఔటయ్యేవాడు. సిరాజ్ వేసిన ఆ మరుసటి ఓవర్‌లోనే రోహిత్ శర్మ ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను వికెట్ కీపర్ కుశాల్ మెండీస్ వదిలేసాడు.

ఈ క్యాచ్ పట్టినా రోహిత్ 12 పరుగులకే వెనుదిరిగేవాడు. ఈ అవకాశంతో చెలరేగిన రోహిత్ శర్మ.. 28 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలోనే అతను ఐపీఎల్‌లో 7వేల పరుగుల మైలురాయి అందుకున్నాడు. రదీష్ ఖాన్ వేసిన 9వ ఓవర్‌ నాలుగో బంతిని సిక్సర్ తరలించడం ద్వారా రోహిత్ ఈ ఫీట్ సాధించాడు. 7వేల పరుగుల మైలురాయితో పాటు 300 సిక్స్‌ల క్లబ్‌లో చేరాడు.

Rohit Sharma Achieves Historic Milestones 7000 IPL Runs amp amp 300 Sixes in GT vs MI Eliminator

ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో విరాట్ కోహ్లీ(8618) పరుగులతో అగ్రస్థానంలో ఉండగా.. రోహిత్ శర్మ(7000*) రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. శిఖర్ ధావన్(6769), డేవిడ్ వార్నర్(6565), సురేశ్ రైనా(5528), ధోనీ(5439) పరుగులతో తర్వాతి స్థానాల్లో నిలిచారు. ఐపీఎల్‌లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన జాబితాలో క్రిస్ గేల్(357) అగ్రస్థానంలో ఉండగా.. రోహిత్ శర్మ(300*), విరాట్ కోహ్లీ( 291), ధోనీ(364) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

Story first published: Friday, May 30, 2025, 20:51 [IST]
Other articles published on May 30, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+