Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AUS: జడేజాను బండ బూతులు తిట్టిన రోహిత్ శర్మ (వీడియో)

Rohit Sharma abuses Ravindra Jadeja after India lose 2 reviews early

ఇండోర్: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో ఇండోర్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. బుధవారం తొలి రోజు ఆటలో జడేజా వరుసగా రివ్యూలు వృథా చేశాడనే కోపంతో నోరుపారేసుకున్నాడు. ఓ వైపు నవ్వుతూనే జడేజాను మందలించాడు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్.. అనూహ్య టర్న్‌తో తొలి ఇన్నింగ్స్‌లో 109 పరుగులకే కుప్పకూలింది. అనంతరం ఆసీస్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించగా.. జడేజా నాలుగు వికెట్లతో ఆ జట్టును దెబ్బతీసాడు.

రెండు రివ్యూలు వృథా చేయడంతో..

కానీ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా(147 బంతుల్లో 4 ఫోర్లతో 60) హాఫ్ సెంచరీతో చెలరేగడంతో టీమిండియాకు కావాల్సిన వికెట్ల దక్కలేదు. ఇక ఖవాజా వికెట్ కోసం జడేజా రెండు రివ్యూలు వృథా చేశాడు. పట్టుబట్టి మరీ రోహిత్ శర్మతో రివ్యూ తీసుకునేలా చేశాడు.

ఆసీస్ ఇన్నింగ్స్ సందర్భంగా జడేజా వేసిన ఆరో ఓవర్లో ఉస్మాన్ ఖవాజా వికెట్ల ముందు దొరికిపోయాడు. దాంతో ఎల్బీడబ్ల్యూ కోసం టీమిండియా అప్పీల్ చేయగా.. ఫీల్డ్ అంపైర్ తిరస్కరించాడు. అయితే.. బంతి లైన్‌లో పడి.. వికెట్లపైకి వెళ్తోందని రోహిత్ శర్మకి చెప్పిన జడేజా రివ్యూ కోరాల్సిందిగా పట్టుబట్టాడు. దాంతో కెప్టెన్ రోహిత్ శర్మ డీఆర్‌ఎస్ తీసుకున్నాడు.

చక్కగా చూడాలని..

చక్కగా చూడాలని..

అయితే.. రిప్లైలో బంతి ఔట్‌సైడ్ ది లెగ్ స్టంప్‌పై పడినట్లు కనిపించింది. దాంతో రివ్యూ వృథా అయ్యింది. ఆ తర్వాత 10వ ఓవర్‌లో మరోసారి జడేజా బౌలింగ్‌లో ఖవాజా వికెట్ల ముందు దొరికిపోయాడు. మళ్లీ జడేజా రిక్వెస్ట్‌ చేయడంతో తప్పని పరిస్థితుల్లో రోహిత్ శర్మ రివ్యూ కోరాడు.

కానీ.. ఈసారి బంతి లెగ్ స్టంప్‌కి దూరంగా వెళ్తున్నట్లు రిప్లై కనిపించింది. దాంతో రెండోసారి కూడా రివ్యూ వృథా అయ్యింది. వరుసగా రెండు రివ్యూలు వృథా చేయడంతో తీవ్ర అసహనానికి గురైన రోహిత్.. బంతి ఎక్కడ పిచ్ అవుతుందో చూడాలని మండిపడ్డాడు. రాయలేని పదాలను కూడా ఉపయోగించాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

కష్టాల్లో భారత్..

కష్టాల్లో భారత్..

156/4 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను కొనసాగించిన ఆస్ట్రేలియా.. అశ్విన్, ఉమేశ్ యాదవ్ తీన్మార్ వేయడంతో 197 పరుగులకు కుప్పకూలింది. దాంతో ఆసీస్‌కు 89 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా 78 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

రోహిత్ శర్మ(33 బంతుల్లో 12)తో పాటు శుభ్‌మన్ గిల్(5), విరాట్ కోహ్లీ(13), రవీంద్ర జడేజా(7) దారుణంగా విఫలమయ్యారు. చతేశ్వర్ పుజారా(36 బ్యాటింగ్) రాణిస్తుండగా.. అయ్యర్(0 బ్యాటింగ్) అతనికి జత కలిసాడు. రెండో సెషన్ ముగిసే సరికి 4 వికెట్లకు 79 పరుగులు చేసింది. టీమిండియా ఇంకా 9పరుగుల వెనుకంజలో ఉంది.

Story first published: Thursday, March 2, 2023, 14:43 [IST]
Other articles published on Mar 2, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+