న్యూజిలాండ్ టూర్ : రోహిత్ శర్మను ఊరిస్తున్న రికార్డులు

హైదరాబాద్ : న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మను మరో అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఈ టూర్‌లో భారత్ ఆతిథ్య జట్టుతో 5 టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్ట్‌లు ఆడనుంది. ఇక ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి టీ20 శుక్రవారం మధ్యాహ్నం 12.20 గంటలకు ప్రారంభంకానుంది.
ఈ మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ 63 పరుగులు చేస్తే అంతర్జాతీయ క్రికెట్‌లో ఓపెనర్‌గా 10 వేల రన్స్ మార్క్‌ను అందుకోనున్నాడు. ఇప్పటి వరకూ భారత్ తరఫున సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, సునీల్ గావస్కర్‌లు మాత్రమే ఓపెనర్లుగా 10 వేల మార్క్‌ను అందుకున్నారు. ఆస్ట్రేలియా సిరీస్‌లో సెంచరీతో చేలరేగిన రోహిత్.. కివీస్‌తో తొలి టీ20లో ఆ ఫామ్‌ను రిపీట్ చేస్తే ఈ అరుదైన ఫీట్‌ను పేరున లిఖించుకోనున్నాడు. ఫలితంగా ఈ ఘనతనందుకున్న నాలుగో ఓపెనర్‌గా రికార్డులకెక్కనున్నాడు. ప్రస్తుతం రోహిత్ మూడు ఫార్మాట్లలో కలిపి ఓపెనర్‌గా 9,937 పరుగులు చేశాడు.

మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేసిన రోహిత్ శర్మ
కెరీర్ ఆరంభంలో మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేసిన రోహిత్ శర్మ.. ఆ తర్వాత అప్పటి కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని సలహాతో పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో ఓపెనర్‌గా అవతారమెత్తాడు. కానీ.. టెస్టుల్లో మాత్రం గత ఏడాది అక్టోబర్ నుంచే ఓపెనర్‌గా బరిలోకి దిగుతున్నాడు. సౌతాఫ్రికా సిరీస్‌లో డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఫార్మూలతో టీమ్‌మేనేజ్ మెంట్ చేసిన ప్రయోగం ఫలించడంతో టెస్టుల్లో కూడా రెగ్యులర్ ఓపెనర్‌గా స్థిరపడిపోయాడు.

మరో 111 చేస్తే..
ఓపెనర్, మిడిలార్డర్‌గా అన్ని ఫార్మాట్లలో కలిపి రోహిత్ శర్మ ఇప్పటివరకు 13,889 పరుగులు చేశాడు. మరో 111 పరుగులు చేస్తే బ్యాట్స్‌మెన్‌గా 14వేల పరుగుల మైలురాయిని రోహిత్ అందుకోనున్నాడు. తద్వార ఈ ఘనతనందుకున్న 8వ భారత బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు పొందనున్నాడు.

కోహ్లీతో పోటీ..
అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డ్ కోసం విరాట్ కోహ్లీతో రోహిత్ శర్మ పోటీ పడుతున్నాడు. ఇప్పటి వరకూ 104 ఇంటర్నేషనల్ టీ20 మ్యాచ్‌లాడిన హిట్ మ్యాన్ 32.11 సగటుతో 2,633 పరుగులు చేయగా.. విరాట్ కోహ్లీ కేవలం 77 మ్యాచ్‌ల్లోనే 52.73 సగటుతో 2,689 పరుగులతో అగ్ర స్థానంలో కొనసాగుతున్నాడు. రోహిత్ మరో 57 పరుగులు చేస్తే కోహ్లీని అధిగమించనున్నాడు. ఇక స్వదేశంలో టెస్ట్ ఓపెనర్‌గా హిట్ అయిన రోహిత్‌కు కివీస్ టూర్ సవాల్‌తో కూడుకున్నదే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications