న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధోనీ స్థానాన్ని భర్తీ చేసే సత్తా అతనికే ఉంది: ఊతప్ప

Robin Uthapppa reveales the player who could be next MS Dhoni

న్యూఢిల్లీ: ప్రస్తుత భారత జట్టులో సీనియర్ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడేలేడు. ధోనీ వారసుడిగా రిషభ్ పంత్‌కు అవకాశాలిచ్చినా.. ప్రత్యామ్నాయంగా కేఎల్ రాహుల్‌ను ప్రయోగించినా అంచానాల్ని అందుకోలేకపోయారు. ప్రస్తుత భారత జట్టులో వికెట్ కీపర్ కంటే మంచి మ్యాచ్ ఫినిషర్ స్థానాన్ని భర్తీ చేయడమే సవాల్‌గా మారింది.

2019 వన్డే ప్రపంచకప్‌ తర్వాత భారత జట్టుకు దూరమైన ధోనీ రిటైర్మెంట్‌పై తీవ్రంగా చర్చ జరుగుతుంది. మరికొద్ది రోజులు ఆడే సత్తా ఉందని ధోనీకి ఉందని అతని సన్నిహితులు చెబుతున్నా.. అతను టీ20 ప్రపంచకప్ వరకే కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ధోనీ స్థానాన్ని భర్తీ చేసే సత్తా అస్సాం యువ హిట్టర్ రియాన్ పరాగ్‌కు ఉందని భారత సీనియర్ క్రికెటర్ రాబిన్ ఊతప్ప జోస్యం చెప్పాడు. తాజాగా క్రిక్‌ఫిట్‌కు ఇచ్చి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. టీమిండియా ఫినిషర్ రోల్‌ను రియాన్ పరాగ్ సమర్థవంతంగా నిర్వహిస్తాడని అభిప్రాయపడ్డాడు.

'రియాన్ పరాగ్ బ్యాటింగ్‌‌ చూడటానికి చాలా బాగుంటుంది. అతను త్వరలోనే భారత్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చి.. సుదీర్ఘకాలం అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడుతాడనుకుంటున్నా. భారత్ జట్టులో ధోనీ స్థానాన్ని భర్తీ చేసేదెవరు? అనే ప్రశ్నకు రియాన్ పరాగ్ కచ్చితంగా ఓ సమాధానం అవుతాడు' అని రాబిన్ ఊతప్ప చెప్పుకొచ్చాడు. భారత్ అండర్-19 వరల్డ్‌కప్‌ విన్నింగ్ ప్లేయర్ అయిన రియాన్ పరాగ్.. ఇప్పటి వరకూ 13 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 659 పరుగులు చేశాడు.

ఇక 2019 ఐపీఎల్ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు తరఫున బరిలోకి దిగిన 18 ఏళ్ల రియాన్.. సంచలన ప్రదర్శనతో అందరి దృష్టి ఆకర్షించాడు. టోర్నీ చరిత్రలోనే అత్యంత పిన్న వయసులో హాఫ్ సెంచరీ నమోదు చేసిన క్రికెటర్‌గా రికార్డుకెక్కాడు. ఆ సీజన్‌లో 160 పరుగులతో రెండు వికెట్లు పడగొట్టాడు.

ఇక రియాన్ ప్రదర్శనను అప్పట్లో రాజస్థాన్ రాయల్స్ సారథి స్టీవ్ స్మిత్ కూడా కొనియాడాడు. 'పరాగ్ నిజంగా ఆకట్టుకున్నాడు. నెట్స్‌లో అతని బ్యాటింగ్ చూస్తుంటే ఎంతో అనుభవం ఉన్న ఆటగాడిలా కనిపించాడు. అతను చాలా మంచి క్రికెటర్. మంచి భవిష్యత్తు ఉంది. నా 17 ఏళ్ల వయసులో నాపై నాకు విశ్వాసం ఉంది. కానీ పరాగ్ చాలా స్వేచ్చగా..నిర్భీతిగా షాట్స్ ఆడుతున్నాడు.'అని స్మిత్ చెప్పుకొచ్చాడు.

ఐపీఎల్‌లో కెప్టెన్‌గా రోహిత్ సక్సెస్‌కు అదే కారణం: లక్ష్మణ్ఐపీఎల్‌లో కెప్టెన్‌గా రోహిత్ సక్సెస్‌కు అదే కారణం: లక్ష్మణ్

Story first published: Friday, May 29, 2020, 20:30 [IST]
Other articles published on May 29, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X