Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టాలెంట్‌ను చూసి కాదు.. మార్కెటింగ్ కోసమే గిల్‌‌ను ఎంపిక చేశారు: రాబిన్ ఊతప్ప

భారత సెలెక్టర్లపై టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప విమర్శలు గుప్పించాడు. ఆసియా కప్ 2025 కోసం ఎంపిక చేసిన భారత జట్టులోకి శుభ్‌మన్ గిల్‌ను తీసుకోవడాన్ని ఊతప్ప తప్పుబట్టాడు. ప్రతిభను చూడకుండా మార్కెటింగ్ కోసమే శుభ్‌మన్ గిల్‌ను జట్టులోకి తీసుకున్నారని సంచలన వ్యాఖ్యలు చేశాడు. సెప్టెంబర్ 9 నుంచి యూఈఏ వేదికగా టీ20 ఫార్మాట్‌లో జరిగే ఆసియా కప్ 2025 కోసం భారత సెలెక్టర్లు 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించారు.

భారత టీ20 జట్టులోకి ఏడాది తర్వాత శుభ్‌మన్ గిల్ రీఎంట్రీ ఇచ్చాడు. ఇంగ్లండ్ గడ్డపై కెప్టెన్‌గా గిల్ సత్తా చాటడంతో పాటు ఐపీఎల్‌లోనూ రాణించడంతో అతనికి అవకాశం దక్కింది. అదే సమయంలో సూపర్ ఫామ్‌లో ఉన్న శ్రేయస్ అయ్యర్‌ను సెలెక్టర్లు విస్మరించారు. అంతేకాకుండా శుభ్‌మన్ గిల్‌కు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. దాంతో జట్టు ఎంపికపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. టెస్ట్‌ ఫార్మాట్‌ ప్రదర్శనను పరిగణలోకి తీసుకోని టీ20ల్లోకి ఎలా ఎంపిక చేస్తారనే ప్రశ్నలు వచ్చాయి.

Robin Uthappa Says Shubman Gill s Asia Cup Selection is Driven by Marketing Not Merit

తాజాగా ఈ వ్యవహారంపై తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా స్పందించిన రాబిన్ ఊతప్ప సంచలన వ్యాఖ్యలు చేశాడు. 'శుభ్‌మన్ గిల్‌ను టీ20 ఫార్మాట్‌కు ఎంపిక చేసి భారత సెలెక్టర్లు కొత్త సమస్యను సృష్టించుకున్నారు. భారత క్రికెట్‌లో ప్రతి తరంలోనూ కొంతమంది సూపర్‌స్టార్లు ఉన్నారు. భారత క్రికెట్ శ్రేయస్సు కోసం వారు ప్రత్యేక ఆటగాళ్లకు మద్దతు ఇస్తూ ఉంటారు. ఈ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోందని నేను భావిస్తున్నా. మార్కెటింగ్, వాణిజ్యపరమైన అంశాలు కూడా ముఖ్యమనవే. అందుకే శుభ్‌మన్ గిల్‌ను జట్టులోకి తీసుకున్నారు. ఆటను ముందుకు నడిపించడానికి కొంతమంది సూపర్‌స్టార్లు అవసరం. శుభ్‌మన్ గిల్ కూడా వారిలో ఒకడు అవుతాడు.'అని శుభ్‌మన్ గిల్ చెప్పుకొచ్చాడు.

ఐపీఎల్ 2025 సీజన్‌లో శుభ్‌మన్ గిల్ 15 మ్యాచ్‌ల్లో 650 పరుగులతో సత్తా చాటాడు. ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు. ఆసియా కప్ 2025లో శుభ్‌మన్ గిల్ ఓపెనర్‌గా లేదా.. ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది.

Story first published: Tuesday, September 2, 2025, 15:30 [IST]
Other articles published on Sep 2, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+