Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2025 వేలంలో అతనికి భారీ ధర దక్కాల్సింది: రాబిన్ ఊతప్ప

లక్నో సూపర్ జెయింట్స్(ఎల్‌ఎస్‌జీ) స్టార్ పేసర్ శార్దూల్ ఠాకూర్‌పై టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప ప్రశంసల జల్లు కురిపించాడు. ఐపీఎల్ 2025 సీజన్‌‌లో శార్దూల్ ఠాకూర్ అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడని కొనియాడాడు. మెగా వేలంలో శార్దూల్ ఠాకూర్ అన్‌సోల్డ్‌గా నిలవడం ఇప్పటికీ తనకు నమ్మశక్యంగా లేదని చెప్పాడు. అతనికి భారీ ధర దక్కాల్సిందని అభిప్రాయపడ్డాడు.

ఐపీఎల్ 2025 సీజన్ మెగా వేలంలో శార్దూల్ ఠాకూర్‌ను తీసుకునేందుకు ఫ్రాంచైజీలు ఆసక్తి చూపించలేదు. దాంతో అతను అన్‌సోల్డ్‌గా నిలిచాడు. వరుసగా 9 సీజన్లు ఆడిన శార్దూల్ ఠాకూర్.. అన్‌సోల్డ్‌గా నిలవడం అందర్నీ ఆశ్చర్యపరించింది. ఐపీఎల్ 2025 సీజన్ ఆడే అవకాశం లేకపోవడంతో కౌంటీ క్రికెట్ ఆడేందుకు శార్దూల్ ఠాకూర్ సిద్దమయ్యాడు. కానీ తాను ఒకటి తలిస్తే దేవుడు ఒకటి తలిచినట్లు శార్దూల్ ఠాకూర్‌‌కు అనూహ్యంగా ఐపీఎల్ 2025 సీజన్ ఆడే అవకాశం దక్కింది.

Robin Uthappa Says Shardul Thakur going unsold in IPL 2025 auction still baffling

లక్నో స్టార్ పేసర్ మోహ్‌సిన్ ఖాన్ గాయపడటంతో అతని స్థానంలో శార్దూల్ ఠాకూర్ జట్టులోకి వచ్చాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లోనే రెండు వికెట్లు తీసిన అతను.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్లతో లక్నో విజయంలో కీలక పాత్ర పోషించాడు. రెండు మ్యాచ్‌ల్లోనే 6 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ అందుకున్నాడు. దాంతో అతనిపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది.

శార్దూల్ ఠాకూర్ ప్రదర్శనపై మాట్లాడిన రాబిన్ ఊతప్ప.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'అంతా బాగుంటే.. ముగింపు కూడా బాగానే ఉంటుందనే కొటేషన్ ఉంది. ప్రస్తుతం శార్దూల్ ఠాకూర్ పరిస్థితి కూడా అలానే ఉంది. దురదృష్టవశాత్తు వేలంలో అతను అన్‌సోల్డ్‌గా నిలిచాడు. అతనికి వేలంలో మంచి ధర దక్కాల్సింది. కానీ వేలం డైనమిక్స్ అనూహ్యమైనవి. కొన్ని కారణాలతో అతను అమ్ముడుపోలేదు. ఇప్పటికీ ఇది నాకు ఆశ్చర్యంగానే ఉంది.

ఏది ఏమైనా.. అతను ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో సత్తా చాటి.. ఐపీఎల్‌లో అవకాశం అందుకొని ఆరంభ మ్యాచ్‌ల్లోనే సత్తా చాటడం మాత్రం అద్భుతం. తొలి మ్యాచ్‌లోనూ అతను అద్భుతంగా రాణించాడు. కొన్ని పరుగులు ఇచ్చినప్పటికీ.. కీలక వికెట్లు తీసాడు. అతను ఎప్పుడూ జట్టుకు బ్రేక్‌త్రూలు అందించేందుకు రెడీగా ఉంటాడు. వికెట్లు రాకపోతే మాత్రం ధారళంగా పరుగులిస్తాడు. కానీ మెరుగ్గా రాణిస్తే మాత్రం అతనికి తిరుగుండదు. తొలి మ్యాచ్‌లో అతను మరిన్ని ఓవర్లు బౌలింగ్ చేయాల్సింది. అతను రెండు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు. తన నాలుగు ఓవర్లు కోటా పూర్తి చేయాల్సింది.'అని రాబిన్ ఊతప్ప చెప్పుకొచ్చాడు.

Story first published: Friday, March 28, 2025, 17:28 [IST]
Other articles published on Mar 28, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+