T20 World Cup 2022: ఆ ఒక్కడు తప్పా అందరూ భారత్ సెమీఫైనల్ చేరుతుందన్నారు!

హైదరాబాద్: టీ20 ప్రపంచకప్ 2022 వేటలో అత్యంత కీలకమైన సూపర్-12 దశకు రంగం సిద్ధమైంది. ఒక్క టైటిల్ కోసం రెండు గ్రూపుల్లో ఆరేసి జట్ల మధ్య హోరాహోరీ పోరు జరుగనుంది. శుక్రవారంతో ముగిసిన తొలిరౌండ్ పోటీల నుంచి జింబాబ్వే తొలిసారిగా సూపర్-12కు అర్హత సాధించింది. మరో గ్రూపులో రెండుసార్లు చాంపియన్‌గా నిలిచిన వెస్టిండీస్‌ను ఐర్లాండ్ ఇంటిముఖం పట్టించి అతిపెద్ద సంచలనం సృష్టించింది.
ఓవరాల్‌గా గ్రూప్ 'ఎ' నుంచి శ్రీలంక, నెదర్లాండ్స్.. గ్రూప్ 'బి' నుంచి జింబాబ్వే, ఐర్లాండ్ సూపర్-12కు అర్హత సాధించాయి. అయితే గతేడాది సూపర్-12కు చేరిన విండీస్, నమీబియా, స్కాట్లాండ్‌లకు ఈసారి టోర్నీలో చుక్కెదురైంది.

భారత్‌కు ఆ రెండు జట్లతోనే పోటీ..
అర్హత రౌండ్ మ్యాచ్‌ల్లో ఎదురైన ఫలితాలు భారత జట్టు అవకాశాలను మరింత మెరుగు పరిచినట్టయ్యింది. ఎందుకంటే.. టీమిండియా ఉన్న గ్రూప్ 2లోకి జింబాబ్వే, నెదర్లాండ్స్ జట్లు ప్రవేశించాయి. దీంతో రోహిత్ సేనకు పాక్, సౌతాఫ్రికాలతోనే కాస్త పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. మరో జట్టు బంగ్లాదేశ్ కూడా పేలవ ఫామ్‌తో ఇబ్బందిపడుతోంది. కీలక పేసర్లు అందుబాటులో లేని భారత జట్టు ఈ అవకాశాన్ని సొమ్ము చేసుకుని నాకౌట్ దశకు చేరాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇక మిగిలిన గ్రూప్ 1 మాత్రం క్లిష్టంగా కనిపిస్తోంది. దీంట్లో ఆసీస్, కివీస్, ఇంగ్లండ్ అత్యంత పటిష్టమైన జట్లు కాగా సంచలన ఆటతీరుకు మారుపేరుగా నిలిచే శ్రీలంక, అఫ్ఘాన్, ఐర్లాండ్ కూడా ఇందులోనే ఉన్నాయి.

భారత్‌కు చాన్స్ లేదన్న రాబిన్ ఊతప్ప..
టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్ చేరే జట్లలో భారత్ కచ్చితంగా ఉంటుందని క్రికెట్ ఎక్స్‌పర్ట్స్ అంచనా వేస్తున్నారు. కానీ భారత్‌కు చెందిన కపిల్ దేవ్, హర్షా భోగ్లేలు సైతం రోహిత్ సేనకు అంత సీన్ లేదని నిర్మోహటంగా చెప్పారు. భారత జట్టు బౌలింగ్ బలహీనంగా ఉందని, టీ20 ఫార్మాట్‌లో విశ్వవిజేతగా నిలవాలంటే బౌలర్లు రాణించడం కీలకమని చెప్పారు. బ్యాటర్లు మ్యాచ్‌లు గెలిపిస్తే.. బౌలర్లు టోర్నీలు గెలిపిస్తారని చెప్పారు. తాజాగా ఈ జాబితాలో భారత మాజీ క్రికెటర్, సీఎస్‌కే ప్లేయర్ రాబిన్ ఊతప్ప కూడా చేరాడు. అతను కూడా భారత్ సెమీస్ వెల్లే అవకాశం లేదని చెప్పాడు.

అందరి నోట భారత్ పేరే..
ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్‌ఫో ఎక్స్‌పర్ట్‌గా వ్యవహరిస్తున్న రాబిన్ ఊతప్ప.. తన అంచనా ప్రకారం పాకిస్థాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా సెమీస్ చేరే అవకాశం ఉందన్నాడు. భారత్ ఉన్న గ్రూప్‌లో పాకిస్థాన్, సౌతాఫ్రికా నాకౌట్ చేరుతుందని, భారత్‌కు అవకాశాల్లేవని చెప్పాడు. ఇక ఇదే ప్యాన్‌లో ఉన్న ఇతర ఆటగాళ్లు మాత్రం భారత జట్టే హాట్ ఫేవరేట్ అని తెలిపారు. దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే.. భారత్‌తో పాటు పాకిస్థాన్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా సెమీ ఫైనల్ చేరుతాయని జోస్యం చెప్పాడు.
టామ్ మూడీ, సామ్ బిల్లింగ్స్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయగా.. డుప్లెసిస్ పాకిస్థాన్‌కు బదులు సౌతాఫ్రికాకు అవకాశం ఉందన్నాడు. ఫ్లెమింగ్ ఆస్ట్రేలియాకు బదులు న్యూజిలాండ్ సెమీస్ చేరుతుందన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications