Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: రాబిన్ ఊతప్ప

టీమిండియాలో అవకాశాలు దక్కకపోవడంతో తీవ్ర డిప్రేషన్‌‌లోకి వెళ్లినట్లు మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప తెలిపాడు. జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని చెప్పాడు. జీవితంలో ప్రతీ ఒక్కరు మానసిక ఒత్తిడికి గురవుతుంటారని భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప తెలిపాడు. ఇలా డిప్రెషన్‌కు గురై ప్రాణాలను వదిలేవారిని చూస్తుంటే బాధేస్తుందన్నాడు.

ఇటీవల ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ గ్రాహమ్ థోర్ఫ్ మానసిక ఒత్తిడిని భరించలేక ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. గతంలో భారత మాజీ క్రికెటర్ వీబీ చంద్రశేఖర్‌తో మరో మాజీ ప్లేయర్ డేవిడ్ జాన్సన్ కూడా ఇలానే బలవన్మరణానికి పాల్పడ్డారు. తాజాగా తన యూట్యూబ్ చానెల్ వేదికగా ఊతప్ప మాట్లాడుతూ.. మానసికంగా కుంగుబాటు ఎదురైనప్పుడు జీవిత ప్రయాణం దారుణంగా ఉంటుందని పేర్కొన్నాడు.

Robin Uthappa opens up on his battle with depression Says Felt I was a burden on family

'ఇప్పుడు మనం డిప్రెషన్, ఆత్మహత్యల గురించి మాట్లాడుకుందాం. గ్రాహమ్ థోర్ఫ్, డేవిడ్ జాన్సన్, వీబీ చంద్ర శేఖర్ తదితరులు మానసిక కుంగుబాటు భరించలేకనే ప్రాణాలు విడిచారు. నేను ఆ దశను ధాటి వచ్చినవాడినే. ఆ ప్రయాణం దారుణంగా ఉంటుంది. మానసికంగా బలహీనపరుస్తోంది. మనల్ని ప్రేమించే వారికి భారంగా మారుతున్నామనే ఆలోచనలు వెంటాడుతాయి. ఆ సమయం అత్యంత కఠినంగా ఉంటుంది. మనకు ఎలాంటి విలువ లేదనిపిస్తోంది.

2011లో నాకు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. అసలు మనిషిగా ఎందుకు ఉన్నానా? అని సిగ్గు పడ్డా. జీవితంలో ఏం చేయాలో తెలియకపోతే ఇలానే ఉంటుంది. ఆ ఒక్క రోజు లేకుండా ఉంటే బాగుంటుందని అనిపిస్తోంది. అయితే, ఆ చీకటి నుంచి వెలుగులోకి రావడానికి కాస్త సాయం అవసరం. చివరి వరకు కాకపోయినా.. తదుపరి అడుగు పడేవరకు ఉన్నాసరిపోతుంది.'అని ఊతప్ప చెప్పుకొచ్చాడు.

Story first published: Tuesday, August 20, 2024, 22:43 [IST]
Other articles published on Aug 20, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+