టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కారణంగానే శుభ్‌మన్ గిల్‌పై వేటు పడిందని మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప అన్నాడు. ఇద్దరూ ఫామ్‌లో లేని ఆటగాళ్లను కొనసాగించడం జట్టుకు శ్రేయాస్కారం కాదనే భారత సెలెక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నారని అభిప్రాయపడ్డాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 బరిలోకి దిగే భారత జట్టును ఇటీవల బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే.
రెగ్యులర్ టీ20 టీమ్‌లో రెండు మార్పులు చేసిన సెలెక్టర్లు.. మిగతా జట్టును కొనసాగించారు. పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడిన వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ను తప్పించి ఇషాన్ కిషన్‌ను బ్యాకప్ వికెట్ కీపర్ కమ్ ఓపెనర్‌గా ఎంపిక చేశారు. జితేశ్ శర్మను తప్పించి రింకూ సింగ్‌ను తీసుకున్నారు. అక్షర్ పటేల్‌కు తిరిగి వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు.

తాజాగా ఈ టీమ్ గురించి మాట్లాడిన రాబిన్ ఊతప్ప.. సూర్య వల్లే గిల్‌పై పక్కనపెట్టాల్సి వచ్చిందన్నాడు. 'ప్రపంచకప్ నేపథ్యంలో జట్టులో ఫామ్‌లో లేని ఒక్క ఆటగాడిని మాత్రమే కొనసాగించవచ్చు. అంతకంటే ఎక్కువ మందిని తీసుకుంటే జట్టుకు ఇబ్బందులు ఎదురవుతాయి. సూర్యకుమార్ యాదవ్ ఈ మధ్య అంతగా పరుగులు చేయడం లేదు. అందుకే శుభ్‌మన్ గిల్ జట్టులో చోటు దక్కలేదని నా అభిప్రాయం.
సూర్య ఫామ్‌లో లేడని నేను చెప్పలేను. కానీ అతను పరుగులు చేయడం లేదు. శుభ్‌మన్ గిల్ మాత్రం ఫామ్‌లో లేడు. అతను పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతున్నాడు. శుభ్‌మన్ గిల్ కాస్త గందరగోళంగా కనిపిస్తున్నాడు. సౌతాఫ్రికాతో సిరీస్‌లో లుంగి ఎంగిడి అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అతను శుభ్‌మన్ గిల్‌ను తన బంతులతో ఇబ్బంది పెట్టాడు.
టీ20 ప్రపంచకప్ జట్టును చూసి నేను షాకయ్యా. నిద్రలోంచి మేల్కొని నా ఫోన్ చూశాం. నేను చాలా ఆనందపడ్డా. వారు నిజంగా అద్భుతమైన జట్టును ఎంపిక చేశారు. అయితే వారు ముందుగా గిల్‌ను టీ20 జట్టుకు వైస్ కెప్టెన్‌గా ప్రకటించకుండా ఉండాల్సింది.'అని రాబిన్ ఊతప్ప అభిప్రాయపడ్డాడు.