వైభవ్ సూర్యవంశీ.. అమ్మాయిలకు దూరంగా ఉండు: రాబిన్ ఉతప్ప
టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీని జాగ్రత్త కాపాడుకోవాలని అతని తల్లిదండ్రులతో పాటు టీమ్‌మేనేజ్‌మెంట్‌కు మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప సూచించాడు. ముఖ్యంగా చెడు ప్రవాసాలకు దూరంగా ఉంచాలని కోరాడు. అతని దృష్టి కేవలం క్రికెట్‌పైనే ఉండేలా చూడాలని, వినోద్ కాంబ్లీ, పృథ్వీ షా వంటి ఆటగాళ్ల పరిస్థితి అతనికి రాకుండా జాగ్రత్త పడాలన్నాడు.
ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాబిన్ ఊతప్ప మాట్లాడుతూ.. వైభవ్ ప్రతిభను ప్రత్యేకంగా కొనియాడాడు. అతని క్రికెట్ కోసమే పుట్టాడని, వైట్‌బాల్ క్రికెట్‌లో సచిన్ కంటే ఎక్కువ ప్రభావం చూపగలడని జోస్యం చెప్పాడు.

వారిలా కాకూడదు..
'వైట్ బాల్ క్రికెట్‌లో వైభవ్ సూర్యవంశీ.. సచిన్‌ను మించిన ప్రభావాన్ని చూపించగలడు. కానీ అతను తన కెరీర్‌ను ఎలా ముందుకు తీసుకెళ్తాడనేది ముఖ్యం. భారత క్రికెట్‌లోనూ గతంలో ఎంతో ప్రతిభావంతులైన ఆటగాళ్లు వెలుగులోకి వచ్చారు. వినోద్ కాంబ్లీ, పృథ్వీ షా వంటి ఆటగాళ్లు 17-18 ఏళ్ల వయసులోనే స్టార్ ఇమేజ్ తెచ్చుకున్నారు. కానీ చెడు ప్రవాసాలతో వెనుకబడిపోయారు.
ఆ పరిస్థితి రావొద్దంటే వైభవ్ సూర్యవంశీ రాబోయే ఐదేళ్ల పాటు ఆటపరంగా, వ్యక్తిత్వపరంగా ఎలాంటి పొరపాట్లు చేయకుండా జాగ్రత్తగా నడుచుకోవాలి. వైభవ్ మాటల్లో చాలా అమాయకత్వం కనిపిస్తుంది. యాడ్స్‌లో నటించాలని అవకాశాలు వస్తున్నా వాటిని తిరస్కరిస్తూ అతను క్రికెట్‌పైనే దృష్టి సారిస్తుండటం నాకు బాగా నచ్చింది.
అమ్మాయిలతో జాగ్రత్త..
ప్రస్తుతం అందరూ అతన్ని ఒక చిన్న పిల్లాడిలాగే చూస్తున్నారు. కానీ, 18 ఏళ్లు నిండితే అతను పెద్దవాడవుతాడు. అప్పుడు అమ్మాయిల ఆకర్షణకు దూరంగా ఉండాలి. ప్రస్తుతం వైభవ్ సోషల్ మీడియా వాడకపోవడమే మంచిది. వైభవ్ క్రికెట్ కోసమే పుట్టాడు. అతన్ని క్రికెట్ ప్రపంచంలోనే ఉండనివ్వండి. అలాగని బయటి ప్రపంచానికి దూరం చేయకూడదు.'అని రాబిన్ ఊతప్ప చెప్పుకొచ్చాడు.
జింబాబ్వే పర్యటనలో విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగిన వైభవ్ సూర్యవంశీ రెడ్ బాల్ క్రికెట్ ఆడేందుకు సిద్దమవుతున్నాడు. ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ దులిప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్ వైస్ కెప్టెన్‌గా బరిలోకి దిగబోతున్నాడు. ఇషాన్ కిషన్‌కు డిప్యూటీగా వ్యవహరించనున్నాడు. ఈ టోర్నీలో వైభవ్ సత్తా చాటితే.. రెడ్ బాల్ ఫార్మాట్‌లోకి కూడా ఈ బుడ్డోడు రీఎంట్రీ ఇవ్వనున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

