For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీమిండియా మాజీ క్రికెటర్‌కి జరిమానా.. కారు సీజ్!!

Robin Singhs car seized by Chennai police for violating lockdown regulations


చెన్నై:
మహమ్మారి కరోనా వైరస్ లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా టీమిండియా మాజీ క్రికెటర్‌ రాబిన్‌ సింగ్‌పై జరిమానా పడింది. లాక్‌డౌన్‌ నిబంధనలకు విరుద్ధంగా నిత్యావసర వస్తువులు కొనేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లిన 56 ఏళ్ల రాబిన్‌పై చెన్నై పోలీసులు రూ. 500 జరిమానా విధించారు. జరిమానాతో పాటు అతని కారును కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
చెన్నైలో లాక్‌డౌన్ రూల్స్‌ కఠినం:

చెన్నైలో లాక్‌డౌన్ రూల్స్‌ కఠినం:

లాక్‌డౌన్‌ సడలింపుల నేపథ్యంలో కరోనా వైరస్ వ్యాప్తి భారత దేశంలో రోజురోజుకు ఎక్కువవుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా చెన్నైలో వైరస్ వ్యాప్తి పతాక స్థాయిలో ఉంది. దీంతో చెన్నై, ఆ రాష్ట్రంలోని మరో మూడు జిల్లాల్లో జూన్ 19 నుంచి లాక్‌డౌన్ నిబంధనల్ని తమిళనాడు ప్రభుత్వం కఠినంగా అమలు చేస్తోంది. రూల్స్ ఎవరు బ్రేక్ చేసినా.. ఊరుకోవడం లేదు. ముఖ్యంగా చెన్నై పోలీసులు లాక్‌డౌన్ రూల్స్‌ని కఠినంగా అమలు చేస్తున్నారు.

రూ. 500 జరిమానా:

రూ. 500 జరిమానా:

చెన్నైలోని ప్రజలు ఇంటినుండి రెండు కిలోమీటర్ల పరిధి దాటి ఎవరైనా వస్తే.. వారికి జరిమానాతో పాటు వాహనాల్ని సీజ్ చేస్తున్నారు. అత్యవసర సేవలకు మినహా రోడ్లపై వ్యక్తిగత వాహనాలకు అనుమతి ఇవ్వడం లేదు. తాజాగా రాబిన్ సింగ్ ఆద్యర్ నుంచి ఉత్తండికి కూరగాయాల్ని కొనుగోలు చేసేందుకు కారులో వెళ్ళాడు. రాబిన్ కారుని ఆపి పోలీసులు చెక్ చేయగా.. అతని వద్ద ఎలాంటి ఈ-పాస్ లేదు. అంతేకాదు కారులో ఎందుకు ప్రయాణిస్తున్నాడో అని సరైన సమాధానం (వ్యాలిడ్ రీజన్) చెప్పలేకపోయాడు. దీంతో లాక్‌డౌన్‌ నిబంధనల్ని ఉల్లఘించినట్లు తేల్చిన పోలీసులు.. రూ. 500 జరిమానాతో పాటు రాబిన్ కారును సీజ్ చేసారు.

ఇ-పాస్ లేదు:

ఇ-పాస్ లేదు:

సీజ్ చేసిన రాబిన్ సింగ్ కారుని శాస్త్రి నగర్ స్టేషన్‌కి చెన్నై పోలీసులు తరలించారు. 'ఉదయం రాబిన్ సింగ్ తన కారులో ఈస్ట్ కోస్ట్ రోడ్ (ఇసిఆర్) నుండి వస్తున్నాడు. ఆపి తనిఖీ చేయగా.. ఇ-పాస్ లేదు. కారులో ప్రయాణించడానికి గల సరైన కారణం కూడా చెప్పలేదు. నిబంధనలను ఉల్లంఘించినందుకు మేము అతని వాహనాన్ని స్వాధీనం చేసుకున్నాం. ఆ సమయంలో రాబిన్ చాలా మర్యాదపూర్వకంగా ఉన్నాడు. ఎలాంటి సందడి చేయలేదు' అని చెన్నై పోలీసు అధికారి ఒకరు చెప్పారు.

136 వన్డేలు, ఒక టెస్టు:

136 వన్డేలు, ఒక టెస్టు:

భారత్ తరఫున రాబిన్ సింగ్ 136 వన్డేలు, ఒక టెస్టు మ్యాచ్‌ ఆడాడు. వన్డేల్లో 2336 పరుగులు చేయగా.. ఇందులో ఒక సెంచరీ ఉంది. విశేషం ఏంటంటే ఆ సెంచరీనే అతనికి అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక స్కోర్. ఒకేఒక టెస్టులో 15 రన్స్ బాదాడు. రాబిన్ సింగ్ 1999 వన్డే ప్రపంచకప్‌లో భారత్ తరఫున మ్యాచ్‌లు ఆడాడు. టీమిండియాకు ఫీల్డింగ్ కోచ్‌గా కూడా పనిచేశాడు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ కోచ్‌గానూ బాధ్యతలు నిర్వర్తించాడు.

2023 ప్రపంచకప్‌కు కివీస్‌, ఆసీస్ ఆతిథ్యం!!

Story first published: Friday, June 26, 2020, 10:26 [IST]
Other articles published on Jun 26, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+