Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

2023 ప్రపంచకప్‌కు కివీస్‌, ఆసీస్ ఆతిథ్యం!!

Australia and New Zealand to host 2023 FIFA Womens World Cup


జ్యూరిచ్‌
: ఫిఫా ఆధ్వర్యంలో 2023లో జరిగే మహిళల ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌కు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఈ మెగా ఈవెంట్‌ ఆతిథ్యం కోసం దాఖలు చేసిన బిడ్‌లో ఆసీస్, కివీస్‌లు కొలంబియాను వెనక్కి నెట్టాయి. ఆతిథ్య హక్కుల కోసం గురువారం ఫిఫా కౌన్సిల్‌లో జరిగిన ఓటింగ్‌లో ఈ రెండు దేశాలు కొలంబియాను 22-13 తేడాతో ఓడించాయి.

2023లో జరగనున్న మహిళల ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ ఆతిథ్యాన్ని న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా దేశాలు దక్కించుకున్నాయని ఫిఫా అధ్యక్షుడు గియాని ఇన్‌ఫాంటినో గురువారం ప్రకటించారు. రెండు దేశాల్లో కలిపి మొత్తం 12 నగరాల్లోని 13 స్టేడియాల్లో ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. ప్రపంచకప్‌ మ్యాచ్‌లు 2023, జూలై 10 నుంచి ఆగస్టు 10 వరకు జరుగుతాయి.

2019లో ఫ్రాన్స్‌ వేదికగా జరిగిన ప్రపంచకప్‌లో 24 జట్లు పాల్గొన్నాయి. అయితే మొదటిసారిగా 2023లో జరగనున్న ప్రపంచకప్‌లో 32 జట్లు పాల్గొంటాయి. మొత్తం 32 జట్లను 8 గ్రూపులుగా విభజిస్తారు. ఒక్కో గ్రూప్‌లో నాలుగు జట్లు ఉంటాయి. ఇక మహిళల ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌కు సంబందించిన క్వాలిఫయింగ్‌ మ్యాచులు వచ్చే ఏడాది ప్రారంభం కానున్నాయి. మహిళల ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ను అమెరికా జట్టు అత్యధికంగా నాలుగుసార్లు గెలుపొందింది. గత రెండు ప్రపంచకప్‌లలో (2019, 2015) అమెరికా విజయం సాధించింది.

ఈ ఏడాది నవంబరు 2 నుంచి 21 వరకు భారత్‌లో అండర్‌-17 మహిళల ఫుట్‌బాల్‌ ప్రపంచకప్ టోర్నీ జరగాల్సింది. అయితే ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి కారణంగా వచ్చే ఏడాది ఫిబ్రవరి 17 నుంచి మార్చి 7 వరకు టోర్నీని నిర్వహించనున్నారు. కోల్‌కతా, గువాహటి, భువనేశ్వర్‌, అహ్మదాబాద్‌, ముంబైలలో ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లు జరుగుతాయి. మెగా టోర్నీలో మొత్తం 16 జట్లు పాల్గొంటున్నాయి. ఆతిథ్య హోదాలో భారత మహిళల జట్టు నేరుగా ప్రపంచకప్‌కు అర్హత సాధించింది. ఇక 2022లో జరగనున్న ఫిఫా ప్రపంచకప్‌‌కు ఖతార్ ఆతిథ్యమిస్తోన్న సంగతి తెలిసిందే.

Story first published: Friday, June 26, 2020, 9:35 [IST]
Other articles published on Jun 26, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+