సచిన్‌ను దేవుడనేది ఇందుకే.. సూదులు గుచ్చుకొని మ్యాచ్‌కు సిద్దమవుతున్నాడు! (వీడియో)

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అభిమానులతో ఓ సరదా వీడియోను పంచుకున్నాడు. రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో భాగంగా ఇండియా లెజెండ్స్ తరఫున బరిలోకి దిగుతున్న వీరూ.. తన సహచరుడు, భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తదుపరి మ్యాచ్‌కు ఎలా సిద్దం అవుతున్నాడో తెలిపాడు. క్రికెట్‌లో ఆట్‌టైమ్ అత్యుత్తమ ఓపెనర్లలో సెహ్వాగ్-సచిన్ జోడీ ఒకటనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. వీరిద్దరూ బరిలోకి దిగారంటే పరుగుల వరద పారాల్సిందే. ప్రత్యర్థులకు చెమటలు పట్టాల్సిందే. అలాంటి బ్యాట్స్‌మెన్ అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమై చాలా కాలమైనా ఇంకా పరుగుల దాహం తీరలేదు. ఆ సత్తా ఏమాత్రం తగ్గలేదు.
సూదులు గుచ్చుకొని..
రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో భాగంగా బంగ్లాదేశ్ లెజెండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సెహ్వాగ్(35 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్స్‌లతో 80 నాటౌట్ ) అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగగా.. సచిన్(26 బంతుల్లో 5 ఫోర్లతో 33 నాటౌట్) క్లాస్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. ఈ జోరులోనే మంగళవారం ఇంగ్లండ్ లెజెండ్స్‌తో జరిగే మ్యాచ్‌లో సత్తా చాటడానికి సన్నదమవుతున్నారు. అయితే ఈ మ్యాచ్ కోసం ఫిట్‌నెస్ ప్రక్రియలో భాగంగా సచిన్ తాజాగా తన ఎడమ మోచేతికి సూదులు గుచ్చుకొని ఫిజియో పర్యవేక్షణలో సిద్ధమవుతున్నాడు.

క్రికెట్ ఆడీ ఆడీ..
అందుకు సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్న సెహ్వాగ్.. సచిన్, యువరాజ్‌తో కలిసి సరదాగా జోకులు పేల్చాడు. 'ఈయన మన దేవుడు. క్రికెట్ ఆడీ ఆడీ చేతులమీద వెంట్రుకలు కూడా రాలేదు. ఇప్పుడు సూదులు గుచ్చుకొని తర్వాతి మ్యాచ్‌కు సన్నద్ధమవుతున్నాడు' అని సరదాగా చెప్పుకొచ్చాడు.
తర్వాత పక్కనే కూర్చున్న యువరాజ్ సింగ్‌ను పలకరిస్తూ 'మ్యాచ్‌కు సన్నద్ధమయ్యాడో లేదో తెలుసుకుందాం' అని అన్నాడు. దానికి యువీ ధీటైన జవాబిచ్చాడు.

నువ్వు ఓ సింహం.. ఆయనో కొదమ సింహం..
'భాయ్ నువ్వు ఒక సింహం. ఆయన(సచిన్) ఒక కొదమ సింహం' అని దిగ్గజాలను కీర్తించాడు. ఆపై సెహ్వాగ్ మళ్లీ సచిన్‌ను ఉద్దేశించి.. 'సర్ మీ సన్నద్ధత ఎలా ఉంది' అని అడిగాడు. సచిన్ స్పందిస్తూ..'నువ్వుండగా ఎవరికైనా ఆ అవకాశం ఉంటుందా?' అని సరదాగా పేర్కొన్నాడు. దాంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా నవ్వుకున్నారు. మళ్లీ వీరూ అందుకొని. 'మీరు ఎక్స్‌పర్ట్ కదా.. అందుకే మిమ్మల్ని అడుగుతున్నా. మ్యాచ్‌కు సిద్ధమయ్యారా' అని ప్రశ్నించాడు. సచిన్ సమాధానమిస్తూ 'అందుకోసమే ప్రయత్నిస్తున్నా' అని అన్నాడు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications