
రాయ్‌పూర్: రోడ్ సేప్టీ వరల్డ్ సిరీస్‌లో భాగంగా శ్రీలంక లెజెండ్స్‌తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో ఇండియా లెజెండ్స్ ఆల్‌రౌండర్లు యువ రాజ్ సింగ్(41 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 60), యూసఫ్ పఠాన్(36 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 62 నాటౌట్) హాఫ్ సెంచరీలతో దుమ్మురేపారు. వీరికి తోడు కెప్టెన్ సచిన్ టెండూల్కర్(23 బంతుల్లో 5 ఫోర్లతో 30) కూడా మెరుపులు మెరిపించడంతో శ్రీలంక లెజెండ్స్ ముందు ఇండియా లెజెండ్స్ 182 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇండియా లెజెండ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 179 పరుగులు చేసింది. డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్(10), ఫస్ట్ డౌన్ బ్యాట్స్‌మన్ ఎస్ బద్రీనాథ్ విఫలమైనా.. సచిన్, యువీ, యూసఫ్ చెలరేగారు. సచిన్-యువీ మూడో వికెట్‌కు 43 పరుగులు జోడించగా.. యువీ-యూసఫ్ నాలుగో వికెట్ 85 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు.
చివర్లో ఇర్ఫాన్ పఠాన్(3 బంతుల్లో 1 సిక్స్‌తో 8) భారీ షాట్ ఆడటంతో ఇండియా లెజెండ్స్ భారీ స్కోర్ చేయగలిగింది. శ్రీలంక లెజెండ్స్ బౌలర్లలో రంగన హెరాత్, సనత్ జయసూర్య, ఫర్వీజ్ మెహరూఫ్ తలో వికెట్ తీశారు.