
ఖాళీ మైదానాలన్నారు.. రద్దు చేశారు.!
రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ మాజీ క్రికెటర్ల టీ20 సిరీస్ నిరవధికంగా వాయిదా పడింది. ముంబై వేదిక సచిన్, లారా తదితర మాజీ క్రికెటర్లతో జరిగిన ఈ టోర్నీలో ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు జరగాయి. కరోనా నేపథ్యంలో ఫైనల్ సహా ఏడు మ్యాచ్‌లను ప్రేక్షకులు లేకుండా పుణె ఎమ్‌సీఏ స్టేడియంలో జరపాలని భావించారు. కానీ ప్రజలు, ప్లేయర్ల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని లీగ్‌ను తాత్కలికంగా రద్దు చేయడానికి నిర్వహకులు ఒప్పుకున్నారని అత్యున్నత వర్గాల సమాచారం. పరిస్థితులు మెరుగైన తర్వాత లీగ్‌ను తిరిగి నిర్వహించే అవకాశం ఉంది.

సూపర్ సక్సెస్..
ఇప్పటికే ఈ సిరీస్ సూపర్ సక్సెస్ అయింది. కరోనా భయాన్ని కాదని అలానాటి ఆటగాళ్ల ఆటను మరోసారి ప్రత్యక్షంగా చూసేందుకు అభిమానులు మైదానాలకు పోటెత్తారు. ముంబై వేదికగా జరిగిన అన్ని మ్యాచ్‌లకు ఊహించని రెస్పాన్స్ లభించింది. ఇక మాజీ ఆటగాళ్లు.. లేటు వయసులో కూడా బౌండరీల మోత మోగించడం.. కళ్లు చెదిరే బంతులతో వికెట్లు పడగొట్టడం.. సూపర్ మ్యాన్ విన్యాసాలతో ఫీల్డింగ్ చేయడం.. అభిమానులకు కావాల్సిన మాజానిచ్చింది.

కేంద్రప్రభుత్వ సూచనలు..
ప్రాణాంతక వైరస్ ‘కోవిడ్19' చూస్తుండగానే ‘గ్లోబ్'ను చుట్టేసింది. విదేశీ రాకపోకలతో ఈ మధ్యే భారత్‌కు వచ్చింది. దీని ప్రభావం తెలిసిన భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆటను ఆపం... కానీ ప్రేక్షక సమూహాన్ని మాత్రం అనుమతించబోమని స్పష్టం చేసింది. ‘జన సమూహం మధ్య ఎలాంటి క్రీడల ఈవెంట్లకు అనుమతి లేదు. అయితే ఏ క్రీడను, లీగ్‌ను అడ్డుకోం. ప్రేక్షకుల్లేకుండా పోటీలను నిర్వహించుకోవచ్చు' అని కేంద్ర క్రీడాశాఖ వెల్లడించింది.

ఆటలను ఆపం.. కానీ
ఈ శాఖ కార్యదర్శి రాధేశ్యామ్ మాట్లాడుతూ ‘జాతీయ ఆరోగ్య మిషన్, ఆరోగ్య శాఖ మార్గదర్శకాల ప్రకారం నడుచుకోవాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సహా జాతీయ క్రీడా సమాఖ్య (ఎన్‌ఎస్‌ఎఫ్)లన్నింటికీ స్పష్టంగా తెలియజేశాం. ప్రేక్షకుల మధ్య లీగ్, పోటీల నిర్వహణ కుదరదని చెప్పాం' అని అన్నారు. దీంతో ఐపీఎల్ కూడా ప్రేక్షకుల్లేకుండా ఖాళీ మైదానాల్లో జరిగే అవకాశం ఉంది. ఈ సూచనలతో వరల్డ్ రోడ్ సేఫ్టీ సిరీస్ కూడా తొలు ప్రేక్షకుల్లేకుండా నిర్వహించాలనుకున్నారు.


Click it and Unblock the Notifications













