Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Road safety world series 2022: వెస్టిండీస్ బోణీ.. బంగ్లాదేశ్ చిత్తు! దంచికొడుతున్న శ్రీలంక

Road safety world series 2022: West Indies Legends Register Clinical Win Over Bangladesh

కాన్పూర్: రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ 2022 టోర్నీలో వెస్టిండీస్ లెజెండ్స్ బోణీ కొట్టింది. డబుల్ హెడర్‌లో భాగంగా బంగ్లాదేశ్ లెజెండ్స్‌తో ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన వెస్టిండీస్ లెజెండ్స్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ లెజెండ్స్ 19.4 ఓవర్లలో 98 పరుగులు చేసింది. వికెట్ కీపర్ దిమన్ ఘోష్(22 నాటౌట్) టాప్ స్కోరర్‌గా మరే బ్యాటర్ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. వెస్టిండీస్ బౌలర్లలో క్రిష్మార్ మూడు వికెట్లు తీయగా.. సులీమాన్ బెన్, డేవ్ మహమ్మద్ రెండేసి వికెట్లు పడగొట్టారు.

అనంతరం వెస్టిండీస్ లెజెండ్స్ 15.2 ఓవర్లలో 4 వికెట్లకు 101 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. డ్వేన్ స్మిత్(42 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్‌తో 51) హాఫ్ సెంచరీతో రాణించగా.. కిర్క్ ఎడ్వర్డ్స్(19 బంతుల్లో 2 ఫోర్లతో 22 నాటౌట్) విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో అబ్దుల్ రజాక్, డాలర్ మహముద్, అలోక్ కపాలి తలో వికెట్ తీసారు.

ఆస్ట్రేలియా లెజెండ్స్‌తో జరుగుతున్న రెండో మ్యాచ్‌లో శ్రీలంక లెజెండ్స్ భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తోంది. 16 ఓవర్ల ముగిసేసరికి ఆ జట్టు వికెట్ నష్టపోకుండా 160 పరుగులు చేసింది. కెప్టెన్ తిలకరత్నే దిల్షాన్(44 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 71 బ్యాటింగ్), దిల్షాన్ మునవీరా(51 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 75 బ్యాటింగ్) అజేయ హాఫ్ సెంచరీలతో సత్తా చాటుతున్నారు. ఈ ఇద్దరి ధాటికీ ఆస్ట్రేలియా బౌలర్లు ధారళంగా పరుగులిస్తున్నారు.

ఈ టోర్నీ సచిన్ టెండూల్కర్ సారథ్యంలోని ఇండియా లెజెండ్స్ శుభారంభం చేసింది. శనివారం జరిగిన టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో 61 పరుగుల తేడాతో సౌతాఫ్రికా లెజెండ్స్‌ను ఓడించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇండియా లెజెండ్స్ నిర్ణీత 20ఓవర్లలో 4వికెట్లు కోల్పోయి 217పరుగుల భారీ స్కోరు చేసింది. ఆల్‌రౌండర్ స్టువర్ట్ బిన్నీ ( 42బంతుల్లో 5ఫోర్లు 6సిక్సర్లతో 82 నాటౌట్) చెలరేగి ఆడాడు. అనంతరం ఛేదనకు దిగిన సౌతాఫ్రికా లెజెండ్స్ 20ఓవర్లలో 9వికెట్లు కోల్పోయి 156పరుగులకే పరిమితమైంది.

Story first published: Sunday, September 11, 2022, 21:06 [IST]
Other articles published on Sep 11, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+