Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Road Safety World Series 2022: ఆట ఏమో కానీ.. ఫోజులు అదిరిపోలా!

Road Safety World Series 2022: Tendulkar, Raina, Yuvraj Fun shoot for India Legends goes viral

హైదరాబాద్: అలనాటి ఆటగాళ్లు మళ్లీ మైదానంలో సందడి చేసేందుకు సిద్దమయ్యారు. తమదైన ఆటతో క్రికెట్‌కే వన్నె తెచ్చిన దిగ్గజాలు పొట్టి ఫార్మాట్‌లో మరోసారి అభిమానులను అలరించనున్నారు. రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో భారత రోడ్డు రవాణ, హైవేలు మరియు ఐటీ మంత్రిత్వ శాఖ రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ పేరిట దిగ్గజ ఆటగాళ్లతో రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ నిర్వహిస్తోంది. గతేడాది ఈ టోర్నీకి సంబంధించిన తొలి ఎడిషన్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. మరోసారి అభిమానులను అలరించేందుకు సిద్దమైంది. మరికొద్ది గంటల్లో ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది.

ఈ సిరీస్ రెండో సీజన్‌లో ఇండియన్‌ లెజెండ్స్‌ జట్టుకు సచిన్‌ టెండూల్కర్ సారథిగా వ్యవహరించనున్నాడు. ఈ సిరీస్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ ఇండియన్‌ లెజెండ్స్‌తో పాటు ఆస్ట్రేలియా, శ్రీలంక, వెస్టిండీస్‌, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్‌, ఇంగ్లండ్‌ దిగ్గజ జట్లు బరిలోకి దిగుతున్నాయి. ఈ సీజన్‌లో కొత్తగా న్యూజిలాండ్‌ టీమ్‌ చేరడంతో మొత్తం జట్ల సంఖ్య ఎనిమిదికి చేరింది. ఇక రోడ్‌ సేఫ్టీ వరల్డ్‌ సిరీస్‌ తొలి సీజన్‌లో సచిన్‌ టెండూల్కర్ కెప్టెన్సీలోనే ఇండియా లెజెండ్స్‌ ఫైనల్లో శ్రీలంక లెజెండ్స్‌ను చిత్తు చేసి విజేతగా నిలిచిన విషయం తెలిసిందే.

నేటి( సెప్టెంబర్ 10) నుంచి అక్టోబర్ 1 వరకు రెండో సీజన్ జరగనుంది. ఇక ఈ మ్యాచ్‌లు కాన్పూర్, రాయ్‌పూర్, ఇండోర్‌తో పాటు డెహ్రాడూన్ వేదికగా జరగనున్నాయి. ఆరంభ మ్యాచ్‌కు కాన్పూర్ ఆతిథ్యం ఇవ్వనుండగా.. రాయ్‌పూర్ వేదికగా సెమీఫైనల్స్, ఫైనల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. మరోవైపు లెజెండ్స్ లీగ్ క్రికెట్ కూడా సెప్టెంబర్ 16 నుంచి ప్రారంభం కానుంది.

ఈ మ్యాచ్‌లన్నీ కలర్స్ సినీప్లెక్స్, స్పోర్ట్స్ 18 ఖేల్ చానెల్స్‌లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. అంతేకాకుండా వూట్ యాప్, వెబ్‌సైట్‌లో కూడా మ్యాచ్‌లను చూడవచ్చు. అయితే ఈ ఫ్లాట్ ఫామ్స్‌లో మ్యాచ్ చూడాలంటే రుసుము చెల్లించి సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఫ్రీగా చూడాలంటే జియో టీవీ యాప్ ద్వారా మ్యాచ్‌లను చూడవచ్చు. ఈ టోర్నీలో తొలి మ్యాచ్ ఇండియా లెజెండ్స్, సౌతాఫ్రికా లెజెండ్స్ మధ్య కాన్పూర్ వేదికగా జరగనుంది.

అయితే ఈ మ్యాచ్ నేపథ్యంలో అలనాటి భారత ఆటగాళ్లు సచిన్ టెండూల్కర్, సురేశ్ రైనా, యూసఫ్ పఠాన్, ప్రజ్ఞాన్ ఓజా, స్టువర్ట్ బిన్నీ, మునాఫ్ పటేల్ ఫొటోలకు ఫోజులిచ్చారు. దీనికి సంబంధించిన వీడియోను నిర్వాహకులు సోషల్ మీడియా వేదికగా షేర్ చేయగా.. వైరల్ అయ్యింది. ఆట ఏమో కానీ ఫోజులు మాత్రం అదిరిపోయాయని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

Story first published: Saturday, September 10, 2022, 18:03 [IST]
Other articles published on Sep 10, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+