Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భారత్‌ను వారి సొంతగడ్డపై ఓడించాం.. అవసరమైతే మమ్మల్ని వాడుకోండి: కెవిన్ పీటర్సన్

Road Safety World Series 2021: After Beating India Legends, Kevin Pietersens Quip To England Selectors

రాయ్‌పూర్: భారత్‌ను వారి సొంతగడ్డపై ఓడించామని, ఈసీబీ చేయలేని పని తాము చేశామని ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ అన్నాడు. రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో భాగంగా మంగళవారం ఇండియా లెజెండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ లెజెండ్స్ 6 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ కెవిన్ పీటర్సన్‌ ( 37 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 75) పరుగుల విధ్వంసం సృష్టించాడు. 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో వేగవంతంగా అర్థ సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు.

ఈ విజయంపై ఇన్‌స్టాగ్రామ్ వేదికగా సంతోషం వ్యక్తం చేసిన కెవిన్... ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు, సెలెక్టర్లపై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ఇంగ్లండ్‌ లెజెండ్స్‌ టీమ్‌ ఫొటోను షేర్‌ చేస్తూ 'ఎట్టకేలకు ఇంగ్లండ్‌ జ్టటు భారత్‌ను తన సొంతగడ్డపై ఓడించింది.. ఎంత కూల్‌గా సాగిపోయిందో గేమ్‌. ఇంగ్లండ్‌ సెలెక్టర్స్‌ .. ఇంకా మేము బరిలోనే ఉన్నాం'' అంని క్యాప్షన్‌గా పేర్కొన్నాడు.

ప్రస్తుతం పీటర్సన్‌ షేర్‌ చేసిన ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా ఇటీవలే ఇంగ్లండ్‌తో ముగిసిన నాలుగు టెస్టుల సిరీస్‌ను టీమిండియాను 3-1తో సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూనే పీటర్సన్ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ఇక ఇంగ్లండ్‌, భారత్‌ల మధ్య ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి టీ20 అహ్మదాబాద్‌ వేదికగా శుక్రవారం(మార్చి 12న) జరగనుంది.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ లెజెండ్స్.. కెప్టెన్ కెవిన్ పీటర్సన్ వేగవంతమైన హాఫ్ సెంచరీతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 188 పరుగులు చేసింది. అనంతరం 189 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత దిగ్గజాలు నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లకు 182 పరుగులకే పరిమితమైంది. టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ (34 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 61 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగినా ఇండియా లెజెండ్స్‌కు ఓటమి తప్పలేదు.

Story first published: Thursday, March 11, 2021, 11:46 [IST]
Other articles published on Mar 11, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+