For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Road Safety World Series 2020: వారెవ్వా సెహ్వాగ్.. నలభై దాటినా తగ్గలేదు కదా..!!

Road Safety World Series 2020: Virender Sehwag Fires India Legends Beat West Indies
Road Safety World Series 2020: Sehwag (74) With 11 Fours, See How the 90’s Came Back|#LegendsAreBack

ముంబై: అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు వీడ్కోలు పలికినా.. వయసు నలభై దాటినా భారత లెజండరీ క్రికెటర్, డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆటలో మాత్రం వన్నె తగ్గలేదు. తనదైన శైలిలో తొలి బంతినే బౌండరీకి తలరించిన వీరూ.. తన పార్ట్‌నర్, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌తో కలిసి మెరుపులు మెరిపించాడు. స్క్వేర్ కట్‌తో సెహ్వాగ్.. హ్యాట్రిక్ ఫోర్లతో సచిన్ ప్రత్యర్థులను ఓ ఆట ఆడుకుంటూ.. అభిమానులకు కావాల్సిన మజానందించారు. ఒకప్పటి రోజులను గుర్తు చేశారు.

 అలనాటి ఆటగాళ్ల సందడి..

అలనాటి ఆటగాళ్ల సందడి..

రిటైర్ అయిన ఆటగాళ్లు మళ్లీ ఆడటం.. మెరుపులు మెరిపించడం ఏంటనే సందేహం కలుగుతోందా? సచిన్, సెహ్వాగ్, యువరాజ్.. ఇలా క్రికెట్ దిగ్గజాలందరూ కలిసి చడీచప్పుడు లేకుండా శనివారం ముంబైలో మ్యాచ్ ఆడేశారు. రోడ్డు భద్రతపై అవగాహన పెంచేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న వరల్డ్ రోడ్ సేఫ్టీ సిరీస్‌లో అలనాటి ఆటగాళ్లంతా సందడి చేశారు.

ఇండియా లెజెండ్స్ గెలుపు..

ఇండియా లెజెండ్స్ గెలుపు..

సచిన్, సెహ్వాగ్, యువ రాజ్, జహీర్ ఖాన్, ఇర్ఫాన్ పఠాన్, మహ్మద్ కైఫ్ తదితర మాజీ క్రికెటర్లతో కూడిన ఇండియా లెజెండ్స్... శనివారం సిరీస్ ప్రారంభ మ్యాచ్‌లో 7 వికెట్లతో వెస్టిండీస్ లెజెండ్స్‌పై విజయం సాధించింది. డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ (57 బంతుల్లో 11 ఫోర్లతో 74 నాటౌట్) మెరుపు హాఫ్ సెంచరీకి తోడు కెప్టెన్ సచిన్ టెండూల్కర్ (36) రాణించడంతో ఇండియా లెజెండ్స్ సునాయస విజయాన్నందుకుంది.

మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ సెహ్వాగ్..

మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ సెహ్వాగ్..

తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ లెజెండ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 150 రన్స్ చేసింది. చందర్‌పాల్ (61), డారెన్ గంగా (32) సత్తాచాటారు. భారత బౌలర్లలో జహీర్ ఖాన్, మునాఫ్ పటేల్, ప్రజ్ఞాన్ ఓజా రెండేసి వికెట్లు తీశారు. అనంతరం సెహ్వాగ్ ధనాధన్ బ్యాటింగ్‌తో ఇండియా 18.2 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్నందుకొని 10 బంతులు మిగిలుండగానే గెలుపొందింది. అద్భుత హాఫ్ సెంచరీ విజయంలో కీలక పాత్ర పోషించిన సెహ్వాగ్‌కు మ్యాన్ ఆఫ్ మ్యాచ్ వరించింది. ఇక రోడ్డు భద్రతా అవగాహన కోసం నిర్వహిస్తున్న ఈ సిరీస్‌లో శ్రీలంక, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా లెజెండ్స్ జట్లు కూడా పోటీపడుతున్నాయి. నేడు(ఆదివారం) శ్రీలంక లెజెండ్స్-ఆస్ట్రేలియా లెజెండ్స్ మధ్య ముంబై వేదికగా మ్యాచ్ జరగనుంది. మార్చి 10న శ్రీలంక లెజెండ్స్‌తో భారత లెజెండ్స్ మరో మ్యాచ్ ఆడనుంది.

 ఈ సిరీస్ ఎందుకంటే?

ఈ సిరీస్ ఎందుకంటే?

ప్రతీ ఏడాది రోడ్డు ప్రమాదాల్లో మరణించే వారి సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా 1.35 మిలియన్లు ఉండగా.. కేవలం భారత్‌లోనే 1,49000 ఉండటం గమనార్హం. అంతేకాకుండా దేశంలో ప్రతీ నాలుగు నిమిషాలకు ఒకరు రోడ్డు ప్రమాదంలో చనిపోతున్నారు. రోజుకు సరాసరిగా సుమారు 1214 మంది ప్రమాదాల బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారు. గత ఐదేళ్లలో సుమారు 65 లక్షల మంది దివ్యాంగులుగా మారారు.దేశంలో క్రికెట్‌కు ఆదరణ ఎక్కువగా ఉండటంతో ఆ దిశగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తే మరింత ఎక్కువ మందికి రీచ్ అవుతామనే సదుద్దేశంతో ఈ టోర్నీ జరుపుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

Story first published: Sunday, March 8, 2020, 10:32 [IST]
Other articles published on Mar 8, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+