Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చాహల్‌ ఓ మోసగాడు.. ఎవరూ నమ్మొద్దు: ఆర్జే మహ్వాష్ (వీడియో)

టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌పై కంటెంట్ క్రియేటర్ ఆర్జే మహ్వాష్‌(RJ Mahvash) సంచలన ఆరోపణలు చేసింది. అతని పేరు ప్రస్తావించకుండా విమర్శలు గుప్పించింది. అతను ఓ మోసగాడని, ఎవరూ నమ్మొద్దని రిక్వెస్ట్ చేసింది. యుజ్వేంద్ర చాహల్, ఆర్జే మహ్వాష్ డేటింగ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలను ఈ ఇద్దరూ ధ్రువీకరించలేదు. కానీ బాహటంగానే కలిసి తిరిగారు. పార్టీలకు హాజరయ్యారు.

ముఖ్యంగా ధనశ్రీ వర్మతో చాహల్ విడాకుల అనంతరం బాగా సన్నిహితంగా మెదిలారు. దాంతో ఈ ఇద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తుందని సోషల్ మీడియా కోడై కూసింది. ఏమైందో ఏమో తెలియదు కానీ.. ఈ ఇద్దరూ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నారు. ఈ ఇద్దరూ అన్‌ఫాలో చేసుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది.

ఈ క్రమంలోనే చాహల్ బిగ్‌బాస్ 13 ఫేమ్ షెఫాలి బగ్గతో కలిసి డిన్నర్ చేస్తూ కనిపించాడు. ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌ కాగా.. చాహల్ మరో అమ్మాయిని పట్టాడంటూ నెటిజన్లు కామెంట్ చేశారు. ఈ క్రమంలోనే ఆర్జే మహ్వాష్‌ సోషల్ మీడియా వేదికగా వరుసగా క్రిప్టిక్ పోస్ట్‌లు పెట్టింది. ఇందులో చాహల్ పేరును ప్రస్తావించకపోయినా.. అతన్ని ఉద్దేశించే ఈ పోస్ట్‌లు పెట్టిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

RJ Mahvash Shares Cryptic Video After After Yuzvendra Chahal Was Spotted With Shefali Bagga

ఇటీవల ఆర్జే మహ్వాష్‌ ఒక వీడియోను షేర్ చేసింది. ఇందులో '90 శాతం సమయాన్ని నేను నా జట్టును సర్దుకోవడానికే కేటాయిస్తాను. మీ అందరికి ప్రశాంతత లభించాలని కోరుకుంటున్నాను. ఈ ఏడాది ఇతరులను మార్చాలనే నా అలవాటును మానేయాలనుకుంటున్నాను. ఆ కోరిక కూడా చచ్చిపోయింది. నువ్వు ఒక నీచమైన పని చేశావు. నా జీవితం నుంచి వెళ్లిపో' అని హిందీలో గట్టిగా అరిచింది. చాహల్ మరో అమ్మాయితో కనిపించాడనే వార్తలు వచ్చిన కొద్దీ సేపటికే ఆర్జే మహ్వాష్‌ ఈ వీడియోను షేర్ చేయడం చర్చనీయాంశమైంది. చాహల్‌ను ఉద్దేశించే ఆమె ఈ వ్యాఖ్యలు చేసిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కానీ ఆర్జె మహ్వాష్ ఉద్దేశం ఏంటి అనేదానిపై స్పష్టత లేదు.

ధనశ్రీ వర్మను ప్రేమించి పెళ్లి చేసుకున్న చాహల్.. ఆ తర్వాత ఆమెకు విడాకులు ఇచ్చి ఒంటరిగా ఉంటున్నాడు. విడాకుల అనంతరం తాను మానసిక సమస్యలు ఎదుర్కొన్నానని, తాగుడుకు బానిస అయినట్లు కూడా అతను ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అన్ని మరిచి ఆటపై ఫోకస్ పెట్టానని తెలిపాడు. టీమిండియాలో చోటు కోల్పోయిన చాహల్.. దేశవాళీ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌ మాత్రమే ఆడుతున్నాడు.

Story first published: Sunday, January 25, 2026, 18:42 [IST]
Other articles published on Jan 25, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+