Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మా బుడ్డోడే టైటిల్ అందిస్తాడు.. ఆ ఒక్క తప్పిదమే మా కొంపముంచింది: రియాన్ పరాగ్

రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీకి రెండో టైటిల్‌ను వైభవ్ సూర్యవంశీ అందిస్తాడని ఆ జట్టు కెప్టెన్ రియాన్ పరాగ్ అన్నాడు. అతని బ్యాటింగ్ అద్భుతమని కొనియాడాడు. బ్యాటింగ్‌లో 20 పరుగులు తక్కువగా చేయడంతోనే గెలవాల్సిన మ్యాచ్‌లో ఓటమిపాలయ్యామని తెలిపాడు.

ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా శుక్రవారం ముల్లాన్‌పూర్ వేదికగా జరిగిన క్వాలిఫయర్-2లో గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించింది. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన రియాన్ పరాగ్.. వైభవ్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. సెకండ్ ఇన్నింగ్స్‌లో హెవీ రోలర్ వేసిన తర్వాత పిచ్ బ్యాటింగ్‌కు మరింత అనుకూలంగా మారిందని చెప్పాడు.

మరో 20 పరుగులు చేసి ఉంటే..

'మేం చేసింది పోరాడే లక్ష్యమే. డిఫెండ్ చేసుకోవాల్సిన స్కోర్. కానీ సెకండ్ ఇన్నింగ్స్‌లో హెవీ రోలర్ వేసిన తర్వాత పిచ్ బ్యాటింగ్‌కు మరింత అనుకూలంగా మారింది. తొలి ఇన్నింగ్స్‌లో బౌలర్లకు పిచ్ నుంచి కొంత గ్రిప్ లభించింది. స్లోయర్ బాల్స్ బాగా పనిచేశాయి. నిజానికి ఈ వికెట్‌పై 230 పరుగులు మంచి స్కోర్ అయ్యేది. ఒకవేళ మేం 240 పరుగులు చేసి ఉంటే.. ప్రత్యర్థికి మరింత సవాల్‌‌గా మారేది.

డిఫెండ్ చేసేటప్పుడు ఆరంభంలో ఓపెనర్ల వికెట్లు అవసరమయ్యాయి. కానీ అది జరగలేదు. దాంతో మ్యాచ్ మాకు కష్టంగా మారిపోయింది. ఈ సీజన్‌లో మాకు చాలా సానుకూలంశాలు లభించాయి. జట్టులో చాలా మంది ఆటగాళ్లు యువకులు, అంతగా అనుభవం లేనివారు కావడంతో మేం ప్లేఆఫ్స్‌కు క్వాలిఫై అవుతామని ఎవరూ అనుకోలేదు. కానీ మా యువ ఆటగాళ్లు అద్భుతంగా రాణించారు. వారు ఇక్కడి నుంచి మరింత మెరుగవుతారు.

మాకు టైటిల్ అందిస్తాడు..

వైభవ్ సూర్యవంశీ గురించి చెప్పడానికి నా దగ్గర మాటలు లేవు. కేవలం బంతిని బలంగా బాది పరుగులు చేయడం ఒక ఎత్తైతే..పరిస్థితులకు తగ్గట్లు ఆడటం మరో ఎత్తు. ఈ మ్యాచ్‌లో అతని ఇన్నింగ్స్ చూస్తే.. ప్రతి షాట్‌ను ఎంతో లెక్కచూసుకుని మరీ ఆడాడు. అది ఎలాగో నేను మాటల్లో చెప్పలేను కానీ.. అతను తన కెరీర్‌లో మరింత ఉన్నత స్థాయికి ఎదుగుతాడు. రాజస్థాన్ రాయల్స్ తరఫున అద్భుతంగా రాణించి మాకు రెండో ఐపీఎల్ టైటిల్‌ను అందిస్తాడని ఆశిస్తున్నా.'అని రియాన్ పరాగ్ చెప్పుకొచ్చాడు.

Riyan Parag Says Heavy Roller Changed the Game but Vaibhav Sooryavanshi Will Win Us Our Second Title After Playoff Exit
Photo Credit: screen grab for JioHotstar

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 214 పరుగుల భారీ స్కోర్ చేసింది. వైభవ్ సూర్యవంశీ(47 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్‌లతో 96) చెలరేగగా.. రవీంద్ర జడేజా(45 నాటౌట్), డోనవన్ ఫెరీరా(38 నాటౌట్) రాణించారు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో కగిసో రబాడ, జాసన్ హోల్డర్ రెండేసి వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్, కగిసో రబాడ తలో వికెట్ పడగొట్టారు.

శతక్కొట్టిన శుభ్‌మన్ గిల్..

అనంతరం గుజరాత్ టైటాన్స్ 18.4 ఓవర్లలో 3 వికెట్లకు 219 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్(53 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్స్‌లతో 104) సెంచరీతో రాణించగా.. సాయి సుదర్శన్(32 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 58) హాఫ్ సెంచరీతో రాణించాడు.

ఈ ఇద్దరూ 167 పరుగుల భాగస్వామ్యంతో రాజస్థాన్ రాయల్స్ పతనాన్ని శాసించారు. రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, నండ్రే బర్గర్, బ్రిజేష్ శర్మ తలో వికెట్ తీసారు.

Story first published: Saturday, May 30, 2026, 0:28 [IST]
Other articles published on May 30, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+