Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

RR vs MI: అందుకే హసరంగా, సందీప్ శర్మ ఆడటం లేదు: రియాన్ పరాగ్

ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ తెలిపాడు. తప్పని పరిస్థితుల్లో తుది జట్టులో మార్పులు చేయాల్సి వచ్చిందన్నాడు. సందీప్ శర్మ, వానిందు హసరంగా గాయపడటంతో వారి స్థానాల్లో ఆకాశ్ మధ్వాల్, కుమార్ కార్తీకేయ ఆడుతున్నట్లు రియాన్ పరాగ్ చెప్పాడు.

'మేం ముందుగా బౌలింగ్ చేస్తాం. డ్యూ వచ్చే అవకాశం ఉంది. సాధారణంగా ఇక్కడ మ్యాచ్ సాగుతున్నా కొద్దీ వికెట్‌లో మార్పు ఉంటుంది. పిచ్ కండిషన్స్‌ను అందిపుచ్చుకోవాలని అనుకుంటున్నాం. గెలుపు, ఓటములతో సంబంధం లేకుండా మేం మా ఆటను ఆడుతున్నాం. ఫలితం ఎలా ఉన్నా ఒకేలా ఉండాలని ద్రవిడ్ సర్ చెప్పారు. గత మూడు మ్యాచ్‌లకు ముందే ఒక్కో మ్యాచ్ గెలుస్తూ ముందుకు సాగాలని చెప్పారు. మా సామర్థ్యం మేరకు రాణిస్తే విజయం దక్కుతుంది. జట్టులో ప్రతీ ఒక్కరికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం. తుది జట్టులో మార్పులు జరిగాయి. గాయంతో హసరంగా దూరమవ్వగా.. కుమార్ కార్తీకేయ జట్టులోకి వచ్చాడు. సందీప్ శర్మ వేలు విరగడంతో ఆకాశ్ మధ్వాల్ బరిలోకి దిగాడు.'అని రియాన్ పరాగ్ చెప్పుకొచ్చాడు.

Riyan Parag Reveals The Reason Why Wanindu Hasaranga and Sandeep Sharma not playing for RR against MI in IPL 2025

మరోవైపు టాస్ గెలిస్తే తాము కూడా బౌలింగ్ ఎంచుకునేవాళ్లమని ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తెలిపాడు. 'మేం కూడా ముందుగా బౌలింగ్ చేయాలనుకున్నాం. ఎప్పుడూ మెరుగైన క్రికెట్ ఆడాలనే లక్ష్యంతోనే ఉంటాం. మెరుగై ప్రదర్శన చేయడంపైనే మా జట్టులో చర్చ జరిగింది. గత మ్యాచ్ తరహాలోనే రాణించాలి. ఆటలో ఎలాంటి మార్పు అవసరం లేదు. ఫియర్ లెస్ గేమ్ ఆడాలనుకుంటున్నాం. ఎంత లక్ష్యం అనేది అనవసరం. వికెట్ తగ్గ మార్క్ లక్ష్యం అందుకోవాలి. పిచ్ కండిషన్స్‌ను అందిపుచ్చుకొని రాణించడం ముఖ్యం. డ్యూ అంతగా రాదని భావిస్తున్నా. మేం ఎలాంటి మార్పులు లేకుండా విన్నింగ్ కాంబినేషన్‌తో బరిలోకి దిగుతున్నాం.'అని హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు.

తుది జట్లు:
రాజస్థాన్ రాయల్స్ : యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, నితీష్ రాణా, రియాన్ పరాగ్(కెప్టెన్), ధృవ్ జురెల్(కీపర్), షిమ్రాన్ హెట్మెయర్, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, కుమార్ కార్తికేయ, ఆకాష్ మధ్వల్, ఫజల్‌హక్ ఫరూఖీ

ముంబై ఇండియన్స్: ర్యాన్ రికెల్టన్(కీపర్), రోహిత్ శర్మ, విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), నమన్ ధీర్, కార్బిన్ బాష్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా.

Story first published: Thursday, May 1, 2025, 19:26 [IST]
Other articles published on May 1, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+