SRH vs RR: నా తప్పుడు నిర్ణయం వల్లే ఈ ఓటమి: రియాన్ పరాగ్
ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఎదురైన ఘోర పరాజయానికి తన తప్పుడు నిర్ణయమే ప్రధాన కారణమని రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ తెలిపాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకోకుండా బౌలింగ్ తీసుకొని పెద్ద తప్పు చేశానని వెల్లడించాడు. పిచ్‌ను అంచనా వేయడంలో తాము విఫలమయ్యామని అంగీకరించాడు.
సోమవారం ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 57 పరుగుల భారీ తేడాతో రాజస్థాన్ రాయల్స్‌ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన రియాన్ పరాగ్.. సన్‌రైజర్స్ హైదరాబాద్ అరంగేట్ర పేసర్లు ప్రఫుల్ హింగే, సకీబ్ హుస్సేన్ అసాధారణ బౌలింగ్ ప్రదర్శనతో తమ ఓటమిని శాసించారని అభిప్రాయపడ్డాడు.

ముందుగా బ్యాటింగ్ చేయాల్సింది..
'నిజం చెప్పాలంటే.. భావోద్వేగాలకు లోనయ్యేంత టైమ్ కూడా మాకు లేదు. మేం వరుసగా వికెట్లు కోల్పోయాం. సన్‌రైజర్స్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఈ గెలుపు క్రెడిట్ వారిదే. మేం కూడా కొన్ని పొరపాట్లు చేశాం. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంది. అయితే మేం వరుసగా వికెట్లు కోల్పోయిన విధానం చూసిన తర్వాత.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవాల్సిందేమోననే అభిప్రాయం కలిగింది.
కొత్త బంతికి ఉన్న మెరుపు వల్ల బ్యాట్‌పైకి ముద్దుగా వచ్చింది. కానీ బంతి షైన్ పోయిన తర్వాత పిచ్ స్లోగా మారింది. మేం ముందుగా బ్యాటింగ్ చేసి రెండో బౌలింగ్ చేసి ఉండాల్సింది. కానీ ఇది గడిచిపోయిన విషయం. ఛేజింగ్‌లోనైనా మేం మెరుగ్గా బ్యాటింగ్ చేయాల్సింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ అరంగేట్ర పేసర్లు ఈ మ్యాచ్ విన్నర్లు అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇద్దరూ అదరగొట్టారు..
దేశవాళీ క్రికెట్‌లో వారిని నేను ఎక్కువగా చూడలేదు. బీహార్ వర్సెస్ అస్సాం మ్యాచ్‌లో ఒక సకిబ్ హుస్సేన్ బౌలింగ్ ఎదుర్కొన్నాను. ఈ ఇద్దరూ అద్భుతంగా బౌలింగ్ చేశారు. హోమ్ గ్రౌండ్ ప్రేక్షకుల మద్దతు, వారు పేర్లను నినదిస్తున్నప్పుడు ఈ కుర్రాళ్లపై ఉన్న ఒత్తిడిని నేను గమనించాను. వారు వేసిన మొదటి 4-5 ఓవర్లు నిజంగా అద్భుతం.
అందుకే జడేజాకు బౌలింగ్ ఇవ్వలేదు..
ఇషాన్ కిషన్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తుండటంతోనే రవీంద్ర జడేజాతో బౌలింగ్ చేయించలేదు. రిస్క్ తీసుకోవాలనిపించలేదు. అది అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం. జడేజా కంటే బిష్ణోయ్ ఓవర్లను నమ్మాను. కానీ పిచ్‌పై మేం 30 పరుగులు అదనంగా ఇచ్చాం.
బ్యాటింగ్ విషయానికి వస్తే.. కేవలం 9 పరుగులకే 5 వికెట్లు కోల్పోయినప్పటికీ మేం 160 పరుగులు చేయగలిగాం అంటే అది మా బ్యాటింగ్ డెప్త్‌ను తెలియజేస్తోంది. ఈ ఓటమి నుంచి పుంజుకుంటాం. ఇది చిన్న అడ్డంకి మాత్రమే. కోల్‌కతా వేదికగా జరిగే మా తదుపరి మ్యాచ్‌లో మెరుగైన ప్రదర్శన కనబరుస్తాం.'అని రియాన్ పరాగ్ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications