Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆ తప్పిదంతోనే గెలవాల్సిన మ్యాచ్‌లో ఓడాం: రియాన్ పరాగ్

కీలకమైన క్యాచ్‌ను నేలపాలు చేయడంతోనే గెలవాల్సిన మ్యాచ్‌లో ఓటమిపాలయ్యామని రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ అన్నాడు. బ్యాటింగ్‌లో కూడా 10 పరుగులు తక్కువగా చేశామని అంగీకరించాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

రింకూ సింగ్(34 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో కేకేఆర్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. 8 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అతను ఇచ్చిన సునాయస క్యాచ్‌ను నండ్రే బర్గర్ నేలపాలు చేశాడు. ఈ తప్పిదం రాజస్థాన్ రాయల్స్ పతనాన్ని శాసించింది.

గెలిచే మ్యాచ్‌లో ఓడాం..

ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన రియాన్ పరాగ్.. కొన్ని చిన్న చిన్న తప్పులతో మూల్యం చెల్లించుకున్నామని తెలిపాడు. 'తొలి నాలుగు, ఐదు ఓవర్లను ఆటను చూసి ఇది 170 పరుగులు చేయదగ్గ వికెట్ అని మేం అంచనా వేశాం. కానీ మేం 10 పరుగులు తక్కువగా చేశాం. ఆ తర్వాత బౌలర్లు అసాధారణ ప్రదర్శనతో మమ్మల్ని మ్యాచ్‌లో నిలెబట్టారు.

మేం ఈజీగా గెలవాల్సిన మ్యాచ్ ఇది. ఈ ఓటమికి సాకులు చెప్పడం లేదు కానీ క్యాచ్‌లు వదిలేయడం నష్టం చేసింది. మిడిల్ ఓవర్లలో సరైన లెంగ్త్‌లో బౌలింగ్ చేయలేదు. మా నుంచి కొన్ని చిన్న చిన్న తప్పులు జరిగాయి. ఏది ఏమైనా ఇది మా చేతుల్లో ఉండాల్సిన మ్యాచ్‌ను చేజేతులా చేజార్చుకున్నాం.

Riyan Parag Blames Fielding Errors and 10-Run Shortfall for Rajasthan Royals Loss to KKR in IPL 2026
Photo Credit: screen grab for JioHotstar

అందుకే స్పిన్నర్లతో వేయించా..

వికెట్‌ స్పిన్‌కు అనుకూలంగా ఉండటంతోనే బ్రిజేష్‌తో పాటు ఇతర బౌలర్లను ఆలస్యంగా బరిలోకి దించాను. బిష్ణోయ్, పుంజా బౌలింగ్ చేసే విధానం భిన్నంగా ఉంటుంది. ఆ సమయానికి స్పిన్ బౌలింగ్ అవసరమని నాకు అనిపించింది. అందుకే స్పిన్నర్లతో బౌలింగ్ చేయించాను. నిర్ణయాలు పనిచేసినప్పుడు చూడటానికి బాగుంటుంది. నిజానికి ఈరోజు కూడా మా ప్రణాళికలు బాగానే పనిచేశాయి. కానీ అక్కడక్కడ కొన్ని చిన్న తప్పులు జరిగాయి.

బ్రిజేష్‌తో 14, 16వ ఓవర్లు బౌలింగ్ చేయిద్దామనుకున్నాను. కానీ వారు వరుసగా వికెట్లు కోల్పోయారు. క్రీజులో ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ ఉండటంతో నేను బౌలింగ్ చేశాను. స్పిన్నర్లు బాగా వేయడంతో వారిని నమ్మాను. బిష్ణోయ్ ఓవర్ ముగిసిన తర్వాత లెఫ్ట్ హ్యాండ్ కాంబినేషన్ వల్ల స్పిన్నర్లు పరుగులు ఇస్తారని భావించి బ్రిజేష్‌తో 18, 20వ ఓవర్లు వేయించాలని అనుకున్నాను.

మా వ్యూహం బెడిసి కొట్టింది..

మా మిడిల్ ఆర్డర్ ఆడిన తీరు పట్ల నాకు ఎలాంటి ఫిర్యాదులు లేవు. వారు మంచి ఫ్లాట్‌ఫామ్ సిద్ధం చేశారు. నేను, హెట్మెయర్ చెరో 10-15 బంతులు ఆడాం. కానీ వేగం పెంచాల్సిన సమయంలో మేం విఫలమయ్యాము. ఇది 170 పరుగుల వికెట్ అని మాకు తెలుసు, అందుకే చివరి 5 ఓవర్లలో భారీ స్కోరు చేయాలనుకున్నాం. మా వ్యూహం వర్కవుట్ కాలేదు. కానీ మా ఆటగాళ్ల ఆలోచనా విధానం పట్ల నేను సంతోషంగా ఉన్నాను. కొన్ని చిన్న పొరపాట్లు జరిగాయి. వచ్చే మ్యాచ్‌లో వాటిని సరిదిద్దుకుని సమష్టిగా రాణించేందుకు ప్రయత్నిస్తాం.

యశ్‌రాజ్ పుంజాపై రాజస్థాన్ రాయల్స్ జట్టుకు పూర్తి నమ్మకం ఉంది. కష్టమైన పరిస్థితుల్లో బరిలోకి దింపినప్పుడు అతను మెరుస్తాడు. పుంజా చాలా బాగా బౌలింగ్ చేశాడు. మొదటి ఓవర్లో కొంచెం ఒత్తిడికి లోనైనప్పటికీ, ఇలాంటి కఠినమైన ఓవర్లు వేస్తూ ఉంటే భవిష్యత్తులో అతను మాకు గొప్ప బౌలర్‌గా మారుతాడు.'అని రియాన్ పరాగ్ చెప్పుకొచ్చాడు.

Story first published: Sunday, April 19, 2026, 22:38 [IST]
Other articles published on Apr 19, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+