అతని క్యాచ్ వదలడం మా కొంపముంచింది: రియాన్ పరాగ్
సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) డేంజరస్ బ్యాటర్ అభిషేక్ శర్మ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను వదిలేయడం తమ ఓటమిని శాసించిందని రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ అన్నాడు. ఇంకాస్త మెరుగ్గా ఫీల్డింగ్ చేయాల్సిందని అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.
ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన రియాన్ పరాగ్.. చెత్త ఫీల్డింగ్‌తో పాటు బ్యాటింగ్‌లో 10-15 పరుగులు తక్కువగా చేయడం తమ ఓటమికి ప్రధాన కారణమని చెప్పాడు. 'నైపుణ్యం పరంగా మేం బాగానే రాణించాం. మా ప్రణాళికలను బాగానే అమలు చేశాం. కానీ చాలా క్యాచ్‌లు వదిలేశాం. అభిషేక్ శర్మ వంటి డేంజరస్ ప్లేయర్లకు క్యాచ్‌లు వదిలేసి అవకాశం ఇస్తే ఏ మాత్రం వదిలిపెట్టరు.
క్యాచ్‌లు వదిలేసాం..
అవకాశాలను అందిపుచ్చుకొని పతనాన్ని శాసిస్తారు. ఈ మ్యాచ్‌లో అదే జరిగింది. మేం మెరుగ్గా ఫీల్డింగ్ చేసి ఉండాల్సింది. మా ఫీల్డింగ్ కోచ్ ట్రెవర్ పెన్నీ ఎలా స్పందిస్తారో చూడాలి. మా పట్ల కఠినంగా వ్యవహరించరని ఆశిస్తున్నా. కానీ ఆటలో ఫీల్డింగ్ చాలా కీలకం. తర్వాతి మ్యాచ్‌లో ఈ తప్పిదాలను సరిచేసుకోవడానికి ప్రయత్నిస్తాం. మాకు ఒక రోజు విరామం ఉంది. మానసికంగా రిఫ్రెష్ అయ్యి తర్వాతి మ్యాచ్‌కు సిద్ధమవుతాం.
నిజం చెప్పాలంటే.. మా లక్ష్యాన్ని మేం 10-15 పరుగులు తక్కువ చేశాం. కానీ సన్‌రైజర్స్ బౌలర్లు చివరి 2 ఓవర్లను కట్టడిగా వేసారు. అద్భుతమైన యార్కర్లతో పరుగులు ఇవ్వలేదు. కానీ 15 పరుగులు అదనంగా చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేది. క్రీజులో ఇద్దరు లెఫ్టాండర్లు ఉండటంతోనే బిష్ణోయ్‌తో బౌలింగ్ చేయించలేదు.

అందుకే బిష్ణోయ్‌తో వేయించలేదు..
క్లాసెన్ వచ్చాక బిష్ణోయ్, జడేజాతో బౌలింగ్ చేయించాలనుకున్నా. కానీ వికెట్ స్పిన్‌కు ఏ మాత్రం సహకరించలేదు. అందుకే ఎలాగోలా నాలుగు ఓవర్లు మేనేజ్ చేయాల్సి వచ్చింది. స్పిన్నర్లు పొదుపుగా బౌలింగ్ చేస్తే బాగుండేది. కానీ ఈ వికెట్‌పై పేసర్లే వికెట్లు తీయాలి. స్పిన్నర్లు కేవలం రన్ రేట్‌ను నియంత్రించాలి. అనుకున్న ప్లాన్ సరిగ్గా సాగలేదు. కానీ మళ్లీ ఇలాంటి పరిస్థితి వచ్చినా నేను ఇదే నిర్ణయం తీసుకుంటాను.
జోఫ్రా ఆర్చర్ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఈ రోజు కూడా అదరగొట్టాడు.దురదృష్టవశాత్తు.. కొన్ని టాప్ ఎడ్జ్‌లు ఫీల్డర్లకు దూరంగా పడ్డాయి. మేం కొన్ని క్యాచ్‌లు వదిలేసాం. కొన్ని దురదృష్టకరమైన క్షణాలు ఉన్నాయి. వచ్చే మ్యాచ్‌లో ఇలాంటివి పునరావృతం కాకూడదని కోరుకుంటున్నాను. పంజాబ్ కింగ్స్‌తో మా తదుపరి మ్యాచ్. చండీగఢ్ పిచ్ ఎలా ఉంటుందో ప్రస్తుతానికి మాకు తెలియదు.
వాళ్ళు ఢిల్లీలో భారీ స్కోరును ఛేజ్ చేశారు. కానీ చండీగఢ్ కొత్త గ్రౌండ్, కొత్త మట్టి. కాబట్టి అక్కడ మ్యాచ్ అంత భారీ స్కోర్ల వరకు వెళ్లదని ఆశిస్తున్నా. వారిని తక్కువ స్కోరుకే కట్టడి చేయాలనుకుంటున్నాం. అయితే దీని గురించి ఆలోచించడానికి మాకు సమయం ఉంది. ప్రణాళికలతో ముందుకు వెళ్తాం.'అని రియాన్ పరాగ్ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications