Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Ritika Sajdeh సారీ రోహిత్.. నువ్వు మన పప్పీ కంటే క్యూట్ కాదు!

Ritika Sajdeh shares funny Instagram story ‘Sorry Ro, you’re not the cutest on the set anymore’

న్యూఢిల్లీ: ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత ఆటగాళ్లు విరామ సమయాన్ని ఆస్వాదిస్తున్నారు. ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్, ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్ కోసం యూకే వెళ్లిన కోహ్లీసేన.. ప్రస్తుతం బయో బబుల్ వీడి ఫ్యామిలీస్‌తో ఎంజాయ్ చేస్తుంది. ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌కు ఇంకా ఆరు వారాల సమయం ఉంది. అన్ని రోజుల పాటు బయో బుడగలో ఉండటం కష్టం. అంతేకాకుండా ఆటగాళ్లు మానసికంగా ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వారిని ఉల్లాసంగా ఉంచేందుకు మూడు వారాల పాటు టీమిండియా క్రికెటర్లకు విరామం ఇచ్చారు. బుడగ నుంచి బయటకు వెళ్లి గడిపేందుకు అనుమతి ఇచ్చారు.

దీంతో ఆటగాళ్లంతా ఫ్యామిలీతో సరదాగా గడుపుతున్నారు. వాటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. ఈ క్రమంలోనే హిట్​మ్యాన్​ రోహిత్ శర్మ భార్య రితిక.. ఇన్​స్టా స్టోరీస్​లో ఓ బూమరాంగ్ వీడియోను అభిమానులతో పంచుకుంది. ఇందులో ఆమె రోహిత్​కు సారీ చెబుతూ కనిపించింది. ఈ వీడియోలో రోహిత్ ఏదో ప్రకటన కోసం షూట్​లో ఉండగా .. ఆ గదిలోనే వారి పెంపుడు కుక్క పడుకుని ఉంది.

Ritika Sajdeh shares funny Instagram story ‘Sorry Ro, you’re not the cutest on the set anymore’
Ritika Sajdeh shares funny Instagram story ‘Sorry Ro, you’re not the cutest on the set anymore’

ఈ రెండింటిని పోల్చుతూ సారీ రో.. నీవు ఇక ఏ మాత్రం క్యూట్ కాదు అంటూ క్యాప్షన్ జోడించింది. ఇదే కాకుండా టెస్ట్ వైస్ కెప్టెన్ అజింక్యా రహానే ఫ్యామిలీతో కలిసి పార్క్ వెళ్లి సరదాగా గడుపుతున్న ఫొటోలను, తన కూతరు, అజింక్యా రహానే కూతురు ఆడుకుంటున్న ఫొటోలను కూడా షేర్ చేసింది.

ఈ విరామం అనంతరం టీమిండియా ఆగస్టు 4 నుంచి సెప్టెంబర్ 14 వరకు ఇంగ్లండ్​తో ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది. 2021-23కు సంబంధించిన టెస్టు చాంపియన్​షిప్ ఈ సిరీస్‌తోనే ప్రారంభంకానుంది.​ ఇక డబ్ల్యూటీసీ ఫైనల్లో అంచనాలను అందుకోలేకపోయిన రోహిత్.. ఇంగ్లండ్‌తో సిరీస్‌లోనైనా రాణించాలని భావిస్తున్నాడు. స్వదేశంలో మాత్రమే ఆడగలడనే ముద్రను చెరపేసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు.

Story first published: Wednesday, June 30, 2021, 15:33 [IST]
Other articles published on Jun 30, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+