
బ్యాక్ టు బ్యాక్ సిరీస్‌లతో..
వెస్టిండీస్‌తో బ్యాక్ టు బ్యాక్ సిరీస్‌లు ఆడిన రోహిత్.. ఇప్పుడు శ్రీలంకతో పోరుకు సిద్దమయ్యాడు. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా నేడు(గురువారం) భారత్-శ్రీలంక మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఈ సిరీస్‌కు సిద్దమవుతున్న రోహిత్.. వాటికి సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టా వేదికగా పంచుకున్నాడు. దానికి నెక్ట్స్ అప్ అనే క్యాప్షన్ ఇచ్చాడు. ఇక ఈ పోస్ట్‌పై స్పందించిన రితికా.. 'కెప్టెన్‌గా నువ్వు చేస్తుందంతా బాగానే ఉంది. కానీ ఒకసారి ఫోన్ చేయవచ్చు కదా?'అంటూ కామెంట్ చేసింది. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్‌గా మారింది.

మరో 37 రన్స్ చేస్తే..
వెస్టిండీస్‌తో వన్డే, టీ20 సిరీస్‌లను 3-0తో క్లీన్ స్వీప్ చేసిన రోహిత్ శర్మ సారథ్యంలోని భారత్.. శ్రీలంకతో జరిగే సిరీస్‌పై కన్నేసింది. టీ20 క్రికెట్‌లో థర్డ్ హయ్యెస్ట్ రన్ స్కోరర్‌గా ఉన్న హిట్‌మ్యాన్.. 114 ఇన్నింగ్స్‌లో 33 యావరేజ్, 139.98 స్ట్రైక్‌రేట్‌తో 3263 రన్స్ చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు, 26 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి.
నేడు(గురువారం) శ్రీలంకతో జరగనున్న తొలి టీ20లో మరో 37 పరుగులు చేస్తే.. టీ20 ఫార్మాట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రోహిత్ రికార్డుకెక్కనున్నాడు. ప్రస్తుతం రోహిత్ శర్మ 3,263 పరుగులతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. న్యూజిలాండ్ ఆటగాడు మార్టిన్ గప్తిల్ 3,299 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ 3,296 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు.

మరో 3 మ్యాచ్‌లు ఆడితే..
అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అత్యధిక మ్యాచులు ఆడిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పేందుకు హిట్‌మ్యాన్ 3 మ్యాచుల దూరంలో ఉన్నాడు. ఇప్పటివరకు 122 టీ20 మ్యాచులు ఆడిన రోహిత్ ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్నాడు. పాకిస్థాన్ ఆటగాడు షోయబ్ మాలిక్ 124 మ్యాచులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు కేవలం 9 మంది ఆటగాళ్లు మాత్రమే 100పైగా టీ20 మ్యాచులు ఆడారు.
భారత్ నుంచి వందకు పైగా టీ20 మ్యాచులు ఆడిన ఏకైక ఆటగాడు రోహిత్ కావడం గమనార్హం. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని (98 మ్యాచులు), విరాట్ కోహ్లీ (97 మ్యాచులు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.


Click it and Unblock the Notifications












