For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

‘సూర్య.. మీ బావ హిట్‌మ్యాన్‌కు ఓ హగ్ ఇవ్వు’: రోహిత్ వైఫ్ రితికా

 Ritika’s adorable request to Suryakumar Yadav for husband Rohit Sharma, ‘Give him a hug from me’

బెంగళూరు: టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్ బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో పరిమిత ఓవర్ల కెప్టెన్ రోహిత్ శర్మను కలిసాడు. తొడకండరాల గాయంతో బాధపడుతున్న రోహిత్.. ఎన్‌సీఏలో చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇక సౌతాఫ్రికా పర్యటన‌లో జనవరి 19 నుంచి ప్రారంభమయ్యే మూడు వన్డేల సిరీస్‌కు సూర్య ఎంపికయ్యాడు. త్వరలోనే అతను సౌతాఫ్రికా ఫ్లైట్ ఎక్కనున్నాడు.

ఈ నేపథ్యంలోనే ఎన్‌సీఏకు వెళ్లిన సూర్య.. తన సహచరుడు, ముంబై ఇండియన్స్ సారథి అయిన రోహిత్‌తో అక్కడ సరదాగా గడిపాడు. అతనితో తీసుకున్న ఫొటోను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. దానికి 'హే బ్రో'అని రో పేరు వచ్చేలా క్యాప్షన్ ఇచ్చాడు. ఇక ఈ పోస్ట్‌ను చూసిన రోహిత్ శర్మ సతీమణి రితికా సజ్ధే.. తనదైన శైలిలో బదులిచ్చింది.

 Ritika’s adorable request to Suryakumar Yadav for husband Rohit Sharma, ‘Give him a hug from me’

'సూర్య.. నా తరఫున రోహిత్‌కు ఓ హగ్ ఇవ్వు'అని కామెంట్ చేసింది. ఇది చూసిన సూర్య.. నా కర్మ అనే ఏమోజీతో ఇచ్చినా'అని బదులిచ్చాడు. ప్రస్తుతం ఈ కామెంట్ నెట్టింట వైరల్‌గా మారింది. ముఖ్యంగా రోహిత్ ఫ్యాన్స్ ముంబై ఇండియన్స్ ఆటగాళ్ల మధ్య ఉన్న బాండింగ్ పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

బెంగళూరు: పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా, టెస్ట్ వైస్ కెప్టెన్‌గా డబుల్ ప్రమోషన్ అందుకున్న రోహిత్ శర్మకు అంతలోనే దురదృష్టం వెంటాడింది. సౌతాఫ్రికా పర్యటనకు ముందు ముంబైలో ఏర్పాటు చేసిన ప్రాక్టీస్ క్యాంప్‌లో హిట్ మ్యాన్ ప్రాక్టీస్ చేస్తూ తొడ కండరాల గాయానికి గురయ్యాడు. దాంతో సౌతాఫ్రికా పర్యటన మొత్తానికి దూరమయ్యాడు. ముందుగా టెస్ట్ సిరీస్‌కే అనుకున్నా.. గాయం నయమవ్వకపోవడంతో వన్డే సిరీస్ నుంచి కూడా తప్పుకోవాల్సి వచ్చింది.

ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీలో రిహాబిలిటేషన్‌ తీసుకుంటున్న హిట్‌మ్యాన్‌ ఫిట్‌నెస్‌పై దృష్టిసారించాడు. ఫిజియోల సూచనలతో జిమ్‌లో చెమటోడుస్తున్నాడు. అయితే తొడకండరాల గాయమవడం రోహిత్‌కు ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా ఇదే సమస్యతో హిట్ మ్యాన్ బాధపడ్డాడు. అతను అధిక బరువు ఉండటంతోనే పదే పదే ఈ గాయానికి గురవ్వాల్సి వస్తుంది. అప్పర్ బాడీ వెయిట్ తొడలపై పడటంతో కండరాలు పట్టేస్తున్నాయి. ఈ క్రమంలోనే బరువు తగ్గాలని వైద్యులు రోహిత్‌కు సూచించారు. కనీసం 5-6 కిలోల బరువు తగ్గాలని చెప్పారు. వారి సలహా మేరకు రోహిత్ బరువు తగ్గడంపై దృష్టిసారించాడు.

Story first published: Thursday, January 6, 2022, 21:38 [IST]
Other articles published on Jan 6, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+