For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రిషభ్ పంత్.. ఆ విన్యాసాలే వద్దు: డాక్టర్ దిన్షా పార్దీవాలా

టీమిండియా స్టార్ వికెట్ కీపర్, టెస్ట్ వైస్ కెప్టెన్ రిషభ్ పంత్‌ను ప్రముఖ సర్జన్ డాక్టర్ దిన్షా పార్దీవాలా హెచ్చరించారు. ఐదు టెస్ట్‌ల అండర్సన్-సచిన్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్ట్ రెండు ఇన్నింగ్స్‌ల్లో రిషభ్ పంత్ సెంచరీలతో చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ అనంతరం పిల్లి మొగ్గలు వేస్తూ సెలెబ్రేట్ చేసుకున్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం ఒంటి కన్ను సెలెబ్రేషన్స్‌తో సరిపెట్టుకున్నాడు. దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్.. పిల్లి మొగ్గలు వేయాలని సూచించినా.. పంత్ తర్వాత అంటూ సైగలతో బదులిచ్చాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో ఆర్‌సీబీతో జరిగిన ఆఖరి మ్యాచ్‌లోనూ సెంచరీ అనంతరం ఇలానే పిల్లి మొగ్గలు వేసాడు. అయితే ఈ తరహా సెలెబ్రేషన్స్‌ సరికాదని అతనికి చికిత్స అందించిన డాక్టర్ పార్దీవాలా ఆగ్రహం వ్యక్తం చేశారు.

2022 డిసెంబర్ 30న జరిగిన రోడ్డు ప్రమాదంలో రిషభ్ పంత్ తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రిషభ్ పంత్‌కు పలు సర్జరీలు జరిగాయి. ఈ గాయాల నుంచి పంత్ కోలుకోవడంలో డాక్టర్ పార్దీవాలా కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలోనే అతని పిల్లి మొగ్గ సెలెబ్రేషన్స్‌పై మాట్లాడుతూ.. అది అనవసరమని అభిప్రాయపడ్డాడు.

Rishabh Pant s Somersault Celebration Unnecessary Says Surgeon Dr Dinshaw Pardiwala

జిమ్నాస్ట్ అయినా అనవసరం..

'రిషభ్ పంత్ పిల్లి మొగ్గలు వేయడం అనవసరం. జిమ్నాస్టిక్‌లో అతను శిక్షణ పొందాడు. చూడటానికి లావుగా కనిపించినా అతని శరీరంలో చురుకుదనం, ఫ్లెక్సిబిలిటీ ఉంది. పంత్ చాలా ఏళ్లుగా ఈ విన్యాసాన్ని ప్రాక్టీస్ చేస్తున్నాడు. అతనికి ఇదేం కొత్త కాదు. అయినా ఇలా చేయడం అనవసరం. అతని గాయాల చరిత్ర నేపథ్యంలో ఇలాంటివి చేయకపోవడమే ఉత్తమం. రోడ్డు ప్రమాదనం నుంచి పంత్ ప్రాణాలతో బయటపడటమే గొప్ప అదృష్టం. అతని శరీరానికి తీవ్ర గాయాలయ్యాయి. ముఖ్యంగా కుడి మోకాలికి పెద్ద సర్జరీ జరిగింది.

కాలు తీసేయాల్సి వచ్చేది..

అతని కాలికి రక్త ప్రసరణ జరగడంతో పెద్ద ప్రమాదం తప్పింది. లేదంటే అతని కాలును తీసేయాల్సి వచ్చేది. ప్రమాదం జరిగినప్పుడు మెడ నుంచి మోకాళ్ల వరకు చర్మ ఊడిపోయింది. సర్జరీ తర్వాత కళ్లు తెరిచిన వెంటనే రిషభ్ పంత్ అడిగిన మొదటి ప్రశ్న. నేను మళ్లీ ఆడగలనా? . ఇది అతని దృఢ సంకల్పానికి నిదర్శనం. 'అని డాక్టర్ దిన్షా పార్టీవాలా చెప్పుకొచ్చారు. నూతన ఏడాది తన తల్లి, చెల్లికి సర్‌ప్రైజ్‌ ఇవ్వాలనే ఉద్దేశంతో చెప్పా పెట్టకుండా తన బీఎండబ్ల్యూ కారులో ఒంటరిగా బయలు దేరిన రిషభ్ పంత్‌కు ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాద ధాటికి అతని కారు పూర్తిగా దగ్దమైంది. రోడ్డుపై అటుగా వెళ్లేవారు పంత్‌ను కారు నుంచి లాగేసి రక్షించారు.

Story first published: Tuesday, July 1, 2025, 16:57 [IST]
Other articles published on Jul 1, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+