Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇంటి స్థలం కోసం అర్ధరాత్రి రిషభ్ పంత్ పోస్ట్.. స్పందించిన సీఎం!

టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ సోషల్ మీడియా వేదికగా అర్థరాత్రి చేసిన ఓ పోస్ట్ తీవ్ర చర్చనీయాంశమైంది. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామిని ట్యాగ్ చేస్తూ.. ఇంటి స్థలం కావాలని పంత్ ట్వీట్ చేశాడు. ఈ పోస్ట్‌కు సీఎం ధామి కూడా బదులిచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది.

రిషభ్ పంత్ ఇన్.. ఆ ఇద్దరు ఔట్! శ్రీలంకతో టెస్ట్‌ సిరీస్‌కు భారత జట్టు ఇదే!

రిషభ్ పంత్ ఇన్.. ఆ ఇద్దరు ఔట్! శ్రీలంకతో టెస్ట్‌ సిరీస్‌కు భారత జట్టు ఇదే!

సార్..ఇంటి స్థలం కావాలి!

'నమస్కారం సర్.. ఎలా ఉన్నారు? నేను ఉత్తరాఖండ్‌లో స్థిరపడాలని భావిస్తున్నా. అందుకోసం అనువైన, విశాలమైన స్థలం కోసం మూడేళ్లుగా ప్రయత్నిస్తున్నా. కానీ, నాకు సరైన స్థలం దొరకడం లేదు. ఉత్తరాఖండ్ అంటే నాకు చాలా ఇష్టం. భూమిని సమకూర్చడంలో నాకు మీ సహాయం కావాలి. గతంలో నాకు కేటాయించాల్సిన భూమి విషయం కూడా ఇంకా పెండింగ్‌లోనే ఉంది.

Rishabh Pant Wants to Return Home Seeks Help From Uttarakhand CM Pushkar Singh Dhami

నా సొంత ప్రాంత అభివృద్ధికి తోడ్పాటు అందించాలని అనుకుంటున్నా. దయచేసి ఈ విషయాన్ని పరిశీలించాలని విజ్ఞప్తి చేస్తున్నా. మీ రియాక్షన్ కోసం ఎదురు చూస్తూ ఉంటా. అంతర్జాతీయ వేదికలపై మన రాష్ట్రానికి ప్రాతినిథ్యం వహించినందుకు బహుమతిగా ఏదైనా ఇస్తే బాగుంటుంది. మీరు అనుమతిస్తే.. ప్రభుత్వం నిర్ణయించిన ధర మేరకే కొనుగోలు చేయాలనుకుంటున్నా. దయచేసి సాయం చేయండి'అని రిషభ్ పంత్ అర్ధరాత్రి 12.46 గంటలకు పంత్ ఖాతా నుంచి పోస్ట్‌లు వచ్చాయి.

మీరు ఉత్తరాఖండ్‌కు గర్వకారణం

రిషభ్ పంత్ ట్వీట్‌కు ఉత్తరాఖండ్ సీఎం ఉదయం 8.54 గంటలకు స్పందించారు. 'రిషభ్ పంత్ మీరు ఉత్తరాఖండ్ రాష్ట్రానికి గర్వకారణం. అద్భుతమైన ప్రదర్శన, విజయాలతో దేవభూమి కీర్తిని ప్రపంచవ్యాప్తంగా ఇనుమడింపజేశారు. మాతృభూమిపై మీకున్న ప్రేమ,ఇక్కడికి తిరిగి వచ్చి అభివృద్ధిలో భాగం కావాలనుకునే ఆకాంక్ష అభినందనీయం. మీరు అడిగిన అంశాలకు సంబంధించి అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేస్తాం. వారు త్వరలోనే మిమ్మల్ని సంప్రదిస్తారు.'అని ఉత్తరఖాండ్ సీఎం పంత్ ట్వీట్‌కు బదులిచ్చారు.

అర్ధరాత్రి ట్వీట్ ఎందుకు..

ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్న రిషభ్ పంత్ మూడు రోజుల వామప్ మ్యాచ్ ఆడుతున్నాడు. అర్ధరాత్రి అతను ఇంటి స్థలం కోసం ట్వీట్ చేయడంపై నెటిజన్లు పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కోట్ల రూపాయాల సంపదన పెట్టుకొని ప్రభుత్వం నుంచి సాయం కోరడం ఏంటని ఒకరంటే.. పంత్ ఎక్స్‌ ఖాతాను హ్యాక్ చేసి ఉంటారని మరొకరు సందేహించారు.

IND vs SL వామప్ మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్ డకౌట్! (వీడియో)

Also Read

IND vs SL వామప్ మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్ డకౌట్! (వీడియో)

రిషభ్ పంత్ అర్ధరాత్రి ఇలాంటి పోస్ట్ చేసే అవకాశమే లేదని అభిప్రాయపడుతున్నారు. అర్థరాత్రి వరకు నిద్రపోకుండా ఉన్న రిషభ్ పంత్ ఏదైనా మానసిక సమస్యతో బాధపడుతున్నాడా? అనే సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.

Story first published: Saturday, August 8, 2026, 14:33 [IST]
Other articles published on Aug 8, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+