ఐసీసీ సరికొత్త అవార్డు రిషభ్ పంత్‌దే.. జోరూట్ కన్నా మనోడికే ఎక్కువ ఓట్లు!

దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) ఇటీవల కొత్తగా ప్రవేశపెట్టిన ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును.. భారత యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ సొంతం చేసుకున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో రిషభ్ పంత్ అద్భుత ప్రదర్శనతో టీమిండియా టెస్ట్ సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఆ సిరీస్‌లో నాలుగు ఇన్నింగ్స్‌ల్లో( 97, 89 నాటౌట్) 245 పరుగులతో రాణించాడు. ఇక గబ్బా వేదికగా అతను ఆడిన ఇన్నింగ్స్ అద్భుతం.
ఈ సూపర్ ఇన్నింగ్స్‌లతో ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది జనవరి అవార్డుకు రిషభ్ పంత్, ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్, ఐర్లాండ్ ఓపెనర్ పాల్ స్టిర్లింగ్‌తో నామినేట్ అయ్యాడు. అభిమానుల నుంచి అత్యధిక ఓటింగ్ అందుకున్న పంత్.. పురుషుల ప్లేయర్ ఆఫ్ ది జనవరి అవార్డును సొంతం చేసుకున్నాడు. మహిళా క్రికెటర్లలో శభ్నిమ్ ఇస్మయిల్(సౌతాఫ్రికా)కు ఈ అవార్డు లభించింది. ఇస్మాయిల్ 4.57 ఎకానమీతో టీ20ల్లో 7 వికెట్లు పడగొట్టింది.
ప్రతీ ఆటగాడికి అంకితం..
ఈ అవార్డు రావడంపై రిషభ్ పంత్ సంతోషం వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగమైన ప్రతీ భారత ఆటగాడికి ఈ అవార్డు అంకితమిస్తున్నట్లు తెలిపాడు. 'ఏ ఆటగాడైనా జట్టును గెలిపించడమే గొప్ప రివార్డుగా భావిస్తాడు. నాలాంటి యువ ఆటగాళ్లను ప్రోత్సహించడానికి ఇటువంటి అవార్డులు ప్రేరణగా నిలుస్తాయి. ఆస్ట్రేలియా సిరీస్ విజయంలో సభ్యులైన ప్రతి ఇండియా క్రికెటర్‌కు ఈ అవార్డును అంకితమిస్తున్నాను. నాకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.'అని రిషభ్‌పంత్ తెలిపాడు.

ఫిబ్రవరి రేసులో కూడా..
ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరుగుతున్న సిరీస్‌లోనూ రిషభ్ పంత్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. కష్టాల్లో చిక్కుకున్న జట్టును ధాటైన ఇన్నింగ్స్‌తో 91 పరుగులు చేసి ఆదుకున్నాడు. దాంతో ఫిబ్రవరి నెల అవార్డు రేసులో కూడా అతను నిలవనున్నాడు. ఇక పంత్‌ను అవార్డు వరించడంపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ రమీజ్ రాజా స్పందించాడు. 'అతడు ఆడిన రెండు సందర్భాలు ఎంతో ఒత్తిడితో కూడుకున్నవి. రెండింటిలోనూ అద్భుత నైపుణ్యం కనబరిచాడు. ఒక మ్యాచ్‌లో గెలుపొందిన భారత్, మరో టెస్టును డ్రా చేసుకుంది' అని తెలిపాడు.

నెలలో రెండో సోమవారం..
మూడు ఫార్మాట్లలోని ప్రతీ క్యాటగిరీకి ముగ్గురు నామినీలను ఆన్-ఫీల్డ్ పనితీరు, ఆ నెల రోజుల కాలంలో సాధించిన విజయాల ఆధారంగా ఐసీసీ అవార్డు నామినేటింగ్ కమిటీ నిర్ణయిస్తుంది. ఇది ప్రతి నెల మొదటి రోజున జరుగుతుంది. ఒకటో తేదీ నుంచి చివరి తేదీ వరకు చూపిన ప్రతిభ, పనితీరును రికార్డ్ చేస్తుంది. షార్ట్ లిస్ట్‌లో స్వతంత్ర ఐసీసీ ఓటింగ్ అకాడమీ, ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉంటారు. ఐసీసీ డిజిటల్ ఛానెళ్లలో నెలలో ప్రతి రెండవ సోమవారం విజేతలను ప్రకటిస్తారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications