రిషభ్ పంత్ పెద్ద మనసు.. ఉత్తరాఖండ్ బాధితులకు విరాళం!

డెహ్రాడూన్: ధౌలిగంగా నది ఉగ్రరూపం ఉత్తరాఖండ్ ప్రజలను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. ఆకస్మికంగా సంభవించిన జల విలయం ఆరాష్ట్ర ప్రజలను తీవ్రం ఆందోళనకు గురిచేస్తోంది. వరద ఉధృతిలో కొట్టుకుపోయిన 170 మంది కార్మికుల ఆచూకీ ఇంకా లభించకపోవడం, కొంతమంది తీర ప్రాంతాలకు కొట్టుకువచ్చిన శవాలుగా మిగిలిపోవడం కలవరానికి గురిచేస్తోంది.
ప్రమాదం జరిగినప్పటి నుంచి ఐటీబీపీ, ఆర్మీ, ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్, ఇతర సిబ్బంది సహాయ చర్యలను ముమ్మరం చేసినప్పటికీ వారి అచూకీ లభ్యంకాకపోవడంతో నది ఉధృతికి కొట్టుకుపోయిన 170 మంది మరణించినట్లుగానే ప్రభుత్వం భావిస్తోంది. నది పరివాహాక ప్రాంతాల్లో జల్లెడపడుతున్నా కొద్దీ శవాలు బయపడుతున్నాయి. ఇప్పటి వరకు 14 శవాలను గుర్తించగా.. మొత్తం 16 మందిని సహాయ బృందాలు కాపాడగలిగాయి.
మ్యాచ్ ఫీజు విరాళంగా..
ఈ ప్రమాదం పట్ల యావత్ దేశం దిగ్భ్రాంతికి గురైంది. వరదల్లో చిక్కుకున్న వారు క్షేమంగా తిరిగి రావాలని పలువురు టీమిండియా ఆటగాళ్లు ప్రార్థిస్తున్నారు. యువ ఆటగాడు రిషభ్‌పంత్ ఒక అడుగు ముందుకేసి వరద బాధితులను కాపాడేందుకు తనవంతుగా మ్యాచ్ ఫీజును విరాళంగా ఇవ్వనున్నట్లు ప్రకటించాడు. 'ఉత్తరాఖండ్‌లో అనూహ్యంగా సంభవించిన వరదల కారణంగా తమ వారిని కోల్పోయిన వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఈ దుర్ఘటన ఎంతో కలచివేసింది. బాధితులను కాపాడేందుకు నా వంతుగా మ్యాచ్ ఫీజును విరాళంగా ఇవ్వదల్చుకున్నా. ఈ మొత్తాన్ని అక్కడి సహాయ చర్యల కొరకు అందిస్తాను.'అని రిషభ్ పంత్ ట్వీట్‌లో పేర్కొన్నాడు.

ముందుకు రండి...
అంతేకాకుండా హిమాలయ రాష్ట్ర ప్రజలను ఆదుకునేందుకు ముందుకు రావాల్సిందిగా ట్విటర్ వేదికగా అభిమానులకు పంత్ విజ్ఞప్తి చేశాడు. కాగా చెన్నై వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలిటెస్ట్‌లో పంత్ ఆడుతున్న విషయం తెలిసిందే. 88 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్లతో 91 కీలక ఇన్సింగ్స్‌తో కష్టాల్లో ఉన్న జట్టును ఆదుకున్నాడు. ఉత్తరాఖండ్‌లోని రూర్కీ పంత్ స్వస్థలమనే విషయం తెలిసిందే.
క్షేమంగా ఉండాలని..
ఇతర క్రికెటర్లు కూడా ఈ ఊహించని జల విలయంపై ట్విటర్ వేదికగా స్పందించారు. 'ఉత్తరాఖండ్‌లో మంచు చరియలు విరిగిపడ్డాయని తెలిసింది. ఎంతో బాధగా ఉంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో అందరూ క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నా'అని మాజీ క్రికెటర్ సురేశ్ రైనా ట్వీట్ చేయగా.. 'ఉత్తరాఖండ్ వరద బాధితులు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నా. మీరు వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకుంటే.. లేదా ఏదైనా సహాయం కావాలంటే ఈ నంబర్లను సంప్రదించండి. 1070, 9557444486.'మా జీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్ చేశాడు.
అందరూ బాగుండాలి..
'వరద బాధితులంతా ధైర్యంగా ఉండండి. అందరూ బాగుండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా'అని హర్భజన్‌సింగ్, 'ఉత్తరాఖండ్ జల ప్రళయ బాధితులు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నా.'అని శిఖర్ ధావన్ ట్వీట్ చేశారు. ఉత్తరాఖండ్‌లో జరిగిన విషాదం గురించి తెలిసి ఎంతో బాధకు గురయ్యానని, బాధితులంతా క్షేమంగా తిరిగి రావాలని ఆశిస్తున్నానని వీవీఎస్ లక్ష్మణ్ ఆకాంక్షించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications