Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చావు అంచుల నుంచి ప్రపంచకప్ విజయం.. అంతా ఆ దేవుడి రాత: రిషభ్ పంత్(వీడియో)

టీ20 ప్రపంచకప్ 2024 విజయంపై టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ భావోద్వేగానికి గురయ్యాడు. అంతా ఆ దేవుడి రాత అంటూ తన ప్రపంచకప్ ప్రయాణానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. 16 నెలల క్రితం రిషభ్ పంత్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే.

కొత్త ఏడాది తన కుటుంబ సభ్యులకు సర్‌ప్రైజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో చెప్పపెట్టకుండా తన సొంత కారులో ఢిల్లీ నుంచి రూర్కీ బయలు దేరిన రిషభ్ పంత్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. తన బీఎండబ్ల్యూ కారును అతివేగంగా నడిపిన పంత్.. నిద్రమత్తులో డివైడర్‌ను ఢీకొట్టాడు. ప్రమాద ధాటికి కారు అగ్నికి ఆహుతి అవ్వగా.. అటుగా వెళ్తున్న ఓ బస్ డ్రైవర్, కండక్టర్ రిషభ్ పంత్‌ను కాపాడారు.

Rishabh Pant shares emotional video After India Won T20 World Cup 2024

ప్రమాద తీవ్రతను చూసి రిషభ్ పంత్ కెరీర్ ముగిసిందని అంతా అనుకున్నారు. కానీ పలు సర్జరీల తర్వాత మళ్లీ ఆటను మొదలు పెట్టిన పంత్.. కఠోర శ్రమతో టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చాడు. 15 నెలల సుదీర్ఘ విరామం తర్వాత ఐపీఎల్ 2024 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున బరిలోకి దిగిన పంత్.. సంచలన ప్రదర్శనతో సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు.

ఈ ప్రదర్శనతో టీ20 ప్రపంచకప్ 2024కు ప్రధాన వికెట్ కీపర్‌గా ఎంపికయ్యాడు. ఈ మెగా టోర్నీ ఫస్ట్‌డౌన్‌లో బ్యాటింగ్ చేసిన రిషభ్ పంత్.. కొన్ని మ్యాచ్‌ల్లో అద్భుత ప్రదర్శన కనబర్చాడు. ధనాధన్ బ్యాటింగ్‌తో జట్టు భారీ స్కోర్లు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. కీలక ఫైనల్లో మాత్రం డకౌట్‌గా వెనుదిరిగి అందర్నీ నిరాశపరిచాడు.

ఫైనల్లో డకౌట్ అయినా.. తన తెలివితో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్లో తన ట్రిక్స్‌తో టీమిండియాకు మేలు చేశాడు. ఓవైపు హెన్రీచ్ క్లాసెన్ వరుస సిక్స్‌లతో మూమెంటమ్‌ను తమవైపు తిప్పుకోగా.. రిషభ్ పంత్ గాయం పేరిట మ్యాచ్‌ను ఆపించాడు. మొకాలికి ప్లాస్టర్ వేసుకున్నాడు. దాంతో మ్యాచ్ కాసేపు ఆగిపోగా.. మరుసటి బంతికే క్లాసెన్ ఔటయ్యాడు.

ఉద్దేశపూర్వకంగానే రిషభ్ పంత్ మెడికల్ బ్రేక్ తీసుకున్నాడని, అతనిపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఈ పని కోసమే ఆ దేవుడు రిషభ్ పంత్‌ను టీమిండియాలోకి పంపించి ఉంటాడని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. రిషభ్ పంత్ కూడా తన ట్రైనింగ్ నుంచి ప్రపంచకప్ విజయం వరకు ఎడిట్ చేసిన వీడియోను అభిమానులతో పంచుకున్నాడు. దానికి 'ఆశీర్వాదం, వినయం, కృతజ్ఞతలు.. అంతా ఆ దేవుడి రాత'అనే క్యాప్షన్ ఇచ్చాడు.

ఈ వీడియోలో ఫిట్‌నెస్ సాధించేందుకు పంత్ పడ్డ కష్టం నుంచి ప్రపంచకప్ విజయానికి సంబంధించిన సన్నివేశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Story first published: Wednesday, July 3, 2024, 8:42 [IST]
Other articles published on Jul 3, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+