Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చరిత్ర సృష్టించనున్న రిషభ్ పంత్.. 11 ఏళ్ల తర్వాత..!

టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ చరిత్ర సృష్టించనున్నాడు. దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తర్వాత టీమిండియా టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న వికెట్ కీపర్‌గా నిలవనున్నాడు. గౌహతి వేదికగా శనివారం నుంచి సౌతాఫ్రికాతో ప్రారంభమయ్యే రెండో టెస్ట్‌తో రిషభ్ పంత్ ఈ ఫీట్ సాధించనున్నాడు.

ఈ మ్యాచ్‌కు శుభ్‌మన్ గిల్ దూరం కానున్నాడు. తొలి టెస్ట్ సందర్భంగా మెడ గాయానికి గురైన శుభ్‌మన్ గిల్ ఇంకా కోలుకోలేదు. బుధవారం భారత జట్టుతో కలిసి అతను గౌహతి వెళ్లినా.. మ్యాచ్ సమయానికి ఫిట్‌నెస్ సాధించే అవకాశాలు లేవు. శుభ్‌మన్ గిల్ గాయంపై బీసీసీఐ అప్‌డేట్ ఇచ్చినా.. రెండో టెస్ట్‌కు అతన్ని దూరంగా ఉంచాలని టీమిండియా మేనేజ్‌మెంట్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.

Rishabh Pant Set to Join MS Dhoni in Elite Club as He Becomes First India Captain in Tests After 11 Years

రెండో వికెట్ కీపర్‌గా..

శుభ్‌మన్ గిల్ గైర్హాజరీలో టీమిండియాను నడిపించిన వైస్ కెప్టెన్ రిషభ్ పంతే.. రెండో టెస్ట్‌లోనూ సారథ్యం వహించనున్నాడు. పూర్తి స్థాయి కెప్టెన్‌గా రిషభ్ పంత్‌కు ఇదే తొలి టెస్ట్ మ్యాచ్. అతనే కెప్టెన్‌గా బరిలోకి దిగితే.. ధోనీ తర్వాత భారత జట్టును నడిపించిన రెండో వికెట్‌కీపర్‌గా చరిత్రకెక్కుతాడు. 2014 వరకు ధోనీ టెస్ట్‌ల్లో టీమిండియాను నడిపించిన సంగతి తెలిసిందే. సుదీర్ఘ ఫార్మాట్‌లో భారత జట్టును నడిపించిన ఏకైక వికెట్ కీపర్ అతనే కావడం గమనార్హం. సౌతాఫ్రికాతో రెండో టెస్ట్‌తో రిషభ్ పంత్ ఈ జాబితాలో చేరనున్నాడు.

గిల్‌కు రెస్ట్

ఓ ప్రముఖ వార్త సంస్థ వివరాల ప్రకారం శుభ్‌మన్ గిల్ ఇంకా ఫిట్ కాలేదని తెలుస్తోంది. కానీ రెండో టెస్ట్ ఆడేందుకు అతను ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. కానీ శుభ్‌మన్ గిల్ విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకోవద్దని మేనేజ్‌మెంట్‌కు బీసీసీఐ ఆదేశించిందంట. ఈ క్రమంలోనే గిల్ కోలుకున్నా.. సౌతాఫ్రికాతో 3 వన్డేల సిరీస్ నేపథ్యంలో అతనికి రెండో టెస్ట్ నుంచి విశ్రాంతి ఇవ్వనున్నారు. శుభ్‌మన్ గిల్ గాయంపై బీసీసీఐ బుధవారం కీలక అప్‌డేట్ ఇచ్చింది.

'కోల్‌కతా టెస్ట్‌లో మెడ గాయానికి గురైన శుభ్‌మన్ గిల్‌ను ఆసుపత్రికి తరలించారు. ఒక రోజు అబ్జర్వేషన్‌లో ఉంచి తర్వాత అతన్ని డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం అతను వైద్య చికిత్సకు బాగానే స్పందిస్తున్నాడు. భారత జట్టుతో కలిసి రెండో టెస్ట్ వేదికైన గౌహతికి బుధవారం బయల్దేరుతాడు. బీసీసీఐ మెడికల్ టీమ్ అతన్ని ప్రత్యేకంగా పర్యవేక్షిస్తుంది. అతని పరిస్థితిని బట్టి రెండో టెస్ట్ ఆడే విషయంపై టీమ్‌మేనేజ్‌మెంట్ తుది నిర్ణయం తీసుకుంటుంది.'అని బీసీసఐ ఆ ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం శుభ్‌మన్ గిల్ రెండో టెస్ట్‌కు అందుబాటులో ఉన్నాడని ఈ ప్రకటన ద్వారా స్పష్టం చేసింది.

Story first published: Thursday, November 20, 2025, 11:49 [IST]
Other articles published on Nov 20, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+